అమరావతి: ఏపీ-ఎంసెట్ హాల్‌టికెట్లు బుధవారం (ఏప్రిల్ 18) నుంచి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు వెబ్‌సై‌ట్ నుంచి తమ హాల్‌‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ప్రక్రియ మంగళవారం (ఏప్రిల్ 17) సాయంత్రం వరకు పూర్తి కానందున హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియలో జాప్యం ఏర్పడింది.  అభ్యర్థులు sche.ap.gov.in వెబ్‌సై‌ట్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
ఎంసెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఎంసెట్‌కు మొత్తం 2,74,917 మంది విద్యార్థులు  దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 1,98,231 మంది దరఖాస్తులు సమర్పించారు. ఇంజినీరింగ్ పరీక్ష ఏప్రిల్ 22 నుంచి 25 వరకు, వ్యవసాయం, వైద్య విభాగం పరీక్షలు 25, 26 తేదీల్లో జరగనున్నాయి. అభ్యర్థులు ఇప్పటివరకు ఎంసెట్ కు దరఖాస్తు చేసుకోలేకపోతే రూ.10,000 రూపాయల లేట్ ఫైన్ తో దరఖాస్తు చేసుకోవచ్చు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెబ్‌సైట్‌లో ఏపీ-ఎంసెట్ హాల్‌టికెట్ డౌన్లోడ్ ఇలా:


1. ఏపీ-ఎంసెట్ అధికారిక వెబ్‌సై‌ట్ sche.ap.gov.inకు వెళ్లండి.
2. ఏపీఎంసెట్ 2018 లింక్ పై క్లిక్ చేయండి.
3. స్క్రీన్ మీద చూపినట్లు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్ లను  నమోదు చేయండి.
4. అడ్మిట్ కార్డు చూసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.



ఏపీ ఎంసెట్ ఫలితాలను మే 5, 2018న విడుదల చేస్తారు.