Narayana Arrest: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యహారం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. నారాయణపై జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. నారాయణ అరెస్ట్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అమిత్ షాకు రాసిన లేఖలో కీలక విషయాలు చెప్పారు చంద్రబాబు. నారాయణ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని లేఖలో ఆరోపించారు చంద్రబాబు. నారాయణను హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలింపు ఆలస్యం చేశారని.. దీని వెనుక దురుద్దేశ్యం ఉందన్నారు. గతంలో నర్సాపరం ఎంపీ రఘురామ కృష్ణం రాజును అరెస్ట్ చేయిన సమయంలో జరిగిన ఘటనలను లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నారాయణను కస్టడీలో ఉంచే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రఘరామ వ్యవహారంలో చేసినట్లే కక్షపూరితంగా వ్యవహరించారని విమర్శించారు. పదో తరగతి పరీక్షా పేపర్ల లీకేజీ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని లేఖలో ఆరోపించారు చంద్రబాబు. చిత్తూరు ఎంపీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. నారాయణ ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు గవర్నర్ కు విశ్వభూషణ్ కు కూడా లేఖ రాశారు చంద్రబాబు.


మరోవైపు అర్ధరాత్రి తర్వాత మాజీ మంత్రి నారాయణకు బెయిల్ వచ్చింది. నారాయణపై పోలీసులు పెట్టిన అభియోగాలను తోసిపుచ్చారు న్యాయమూర్తి సులోచనారాణి. 2014లోనే నారాయణ విద్యా సంస్థల చైర్మెన్ పదవికి నారాయణ రాజీనామా చేశారని ఆయన తరపు లాయర్లు వాదనలు వినిపించారు. నారాయణ తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన జడ్జీ సులోచనారాణి.. నారాయణకు బెయిల్ మంజూరు చేశారు.  హైదరాబాద్ లోని తన నివాసం నుంచి నారాయణను మంగళవారం ఏపీ సీఐడీ పోలీసులు అదపులోనికి తీసుకున్నారు. చిత్తూరుకు తరలించారు. గత నెల 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి జడ్పీ హైస్కూల్ నుంచి పదో తరగతి తెలుగు పేపర్ లీకైంది. ఈ  ఘటనలో నారాయణ పాత్ర ఉన్నట్లు తేలిందని.. అందుకే అరెస్ట్ చేశామని ఏపీ పోలీసులు తెలిపారు. 


READ ALSO: Sajjala on Narayana Arrest : నారాయణ అరెస్టుపై సజ్జల క్లారిటీ


READ ALSO: Narayana Bail: మాజీ మంత్రి నారాయణకు ఊరట... పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బెయిల్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook