Ap ex cm ys jagan tweet on evms goes controvercy: దేశంలో ఎన్నికలో ఈవీఎంల వాడటం పై తీవ్ర రచ్చ నడుస్తోంది. ఇటీవల ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పెస్ ఎక్స్ సంస్థల అధినేత ఈవీఎంలోను హ్యకింగ్ చేయవచ్చంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందుకు ఎన్నిలలో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని ఆయన అన్నారు. టెలికామ్ విప్లవానికి పునాదులు వేసిన శ్యామ్ పిట్రోడా సైతం.. ఎన్నికలలో పేపర్ బ్యాలెట్ లను ఉపయోగించాలని అన్నారు. దీంతో మరోసారి దేశంలో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీసైతం ఎలన్ మస్క్ కే సపోర్ట్ చేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం.. ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయని కూడా కామెంట్లు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనికి కౌంటర్ గా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరీ.. ఎలన్ మస్క్ వెంటనే వచ్చి.. ఈవీఎంలు ఎలా ట్యాంపరింగ్ చేస్తారో.. డెమో ఇవ్వాలని సవాల్ విసిరారు. దీనికి ఇప్పటి దాక ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.  తాజాగా, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్... ఈవీఎంలు ఉపయోగించకూడదని, పేపర్ బ్యాలెట్ల విధానంను తిరిగి ఉపయోగించాలని కూడా అన్నారు. దీంతో మరోసారి ఈవీఎంల రచ్చ రాజకీయాల్లో రచ్చగా మారింది. ఇక వైఎస్ జగన్ ను.. ఏపీ టీడీపీ నేతలు వరుస ట్వీట్ లో ఏకీపారేస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహర్ రెడ్డి, బుధ్దా వెంకన్న,  చిన్నికేశినేని, మాజీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు.


గతంలో వైసీసీ గెలిచినప్పుడు.. ఈవీఎంల ట్యాపంరింగ్ జరగలేదా.. అని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ఏపీలో గతంలో గెలిచినప్పుడు.. ఈవీఎం లపై జగన్  చేసిన వ్యాఖ్యల వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మీరు గెలిచినప్పుడు.. ఎలాంటి ట్యాంపరింగ్ ఉండదు.. అదే అపోసిషన్ వాళ్లు ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలిస్తే మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వైఎస్ జగన్ ఓటమి షాకింగ్ ను ఇంకా బైటకు రాలేదని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని టీడీపీ నేతలు ఎక్స్ వేదికగా కౌంటర్ లు ఇస్తున్నారు. 2004 నుంచి ఈవీఎంను ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు.


ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయగలిగే చాన్స్ ఉంటే, కేంద్రంలో బీజేపీకి తక్కువసీట్లు వస్తాయా.. అని ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ లో చిత్తుగా ఓడిపోయేవా.. అంటూ కౌంటర్ వేశారు. వీరంతా అధికారంలో ఉన్న పార్టీలు. అపోసిషన్ లో ఉన్న వారికంటే వీరికి , పవర్స్ ఎక్కువగా ఉంటాయి. మరీ వీరికి తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయో చెప్పండని ఏకీపారేస్తున్నారు. జగన్ ఈసారి పులివేందులలో రాజీనామా చేయాలని.. పేపర్ బ్యాలెట్ల పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిద్దామని.. ఈ సవాల్ స్వీకరించే దమ్ముందా అంటూ టీడీపీ నేత బుధ్దా వెంకన్న తీవ్ర స్థాయిల ఆగ్రహం వ్యక్తం చేశారు.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter