తెలుగుదేశం ( Telugu desam ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి పని ముగిసిపోయిందా..ఏం జరుగుతోంది. ఇప్పుడతని ఆస్థులు వేలానికి సిద్ధమయ్యాయి. ఇ ఆక్షన్ సేల్ ( E Auction Sale notice ) నోటీసు జారీ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ( AP ) లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ex Minister Ganta Srinivasa rao )  ఇప్పుడు పూర్తిగా సమస్యల్లో పడినట్టే. ఇండియన్ బ్యాంకు ( Indian Bank ) రుణం ఎగవేత వ్యవహారంలో బ్యాంక్ సీరియస్ అయింది.  248 కోట్ల రుణం వసూలుకు దిగింది. విశాఖ నగరం ( Visakha city ) తో పాటు పలు ఇతర ప్రాంతాల్లోని గంటా ఆస్థులు వేలానికి సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఇండియన్ బ్యాంకు ఇ ఆక్షన్ సేల్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 25 న గంటా శ్రీనివాసరావు ఆస్థుల్ని బ్యాంకు వేలం వేయనుంది. 


మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మానసపుత్రిక అయిన ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థ ( Prathyusha resources and Infra ) ..బ్యాంకుకు 141.68 కోట్ల మేర బకాయి పడింది. బాకీ రుణం చెల్లించాలని ఇండియన్‌ బ్యాంకు 2016, అక్టోబరు 4వ తేదీన నోటీసులు పంపించింది. కానీ కంపెనీ చెల్లించకుండా చేతులెత్తేసింది.  తరువా ఈ బకాయి వడ్డీతో కలిపి 248.03 కోట్లకు చేరుకుంది. ఇక లాభం లేదనుకుని బ్యాంకు కఠిన చర్యలకు దిగింది. రుణం కోసం తాకట్టు పెట్టిన ప్రత్యూష్ గ్రూప్ ఆస్థుల్ని వేలం వేయాలని  ( Assets for Auction ) నిర్ణయించుకుంది. రుణాలకు బాధ్యులుగా మాజీ మంత్రి  గంటా శ్రీనివాసరావుతో పాటు పీవీ ప్రభాకరరావు, పీవీ భాస్కరరావు, నార్ని అమూల్య, పి.రాజారావు, కేబీ సుబ్రహ్మణ్యం, ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, ప్రత్యూష గ్లోబల్‌ ట్రేడ్‌ లిమిటెడ్‌ సంస్థలను ఇండియన్‌ బ్యాంకు నోటిఫై చేసింది. అయితే ఈ సంస్థ డైరెక్టర్‌ పదవి నుంచి 2011 సంవత్సరంలోనే తప్పుకున్నానని, సంస్థ ఆర్థిక లావాదేవీలతో తనకు సంబంధం లేదని గంటా శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు. 


వేలానికి సిద్ధమైన గంటా ఆస్థులు.. 


విశాఖ నగరంలోని గంగులవారి వీధిలో ప్రత్యూష అసోసియేట్స్‌ పేరుతో ఉన్న వాణిజ్య భవనం..దీని విలువ 154. 72 లక్షలు 


విశాఖపట్నంలోని బాలయ్య శాస్త్రి లే అవుట్ లోని త్రివేణి టవర్స్ లో ప్లాట్, అదే ప్రాంత్లో పి రాజారావు పేరుతో ఉన్న 444 చదరపు గజాల విస్తీర్ణంలోని మరొక ప్లాట్. వీటి విలువ 150.75 లక్షలు. 


ఎండాడ రెవెన్యూ గ్రామ పరిధిలో రుషికొండ గ్రామంలో కేబీ సుబ్రహ్మణ్యం పేరుతో ఉన్న 503.53 చదరపు గజాల స్థలం. దీని విలువ 171.21 లక్షలు 


ప్రత్యూష అసోసియేట్స్‌ పేరుతో ద్వారకా నగర్‌ మొదటి లైన్‌లోని శ్రీ శాంతా కాంప్లెక్స్‌లో ఉన్న ఆస్తి. దీని విలువ 94.19 లక్షలు 


పీవీ భాస్కరరావు పేరుతో తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో షోలింగ్ నల్లూరులో 6వేల చదరపు గజాల భూమి . దీని విలువ 240 లక్షలు 


ప్రత్యూష అసోసియేట్స్‌ షిప్పింగ్‌ సంస్థకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సాంబమూర్తినగర్‌లో ఉన్న 1101 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్థి ఉంది. దీని విలువ 308.46 లక్షలు. అదే సంస్థకు అక్కడే 333.33 చదరపు గజాల మరో స్థలముంది. దీని విలువ 66.67 లక్షలు


ఆనందపురం మండలం వేముల వలసలో పీవీ భాస్కరరావు పేరుతో ఉన్న 4.61 ఎకరాల భూమి. దీని విలువ 2103.07 లక్షలు.


ఇక హైదరాబాద్ లోని మణికొండలో ల్యాంకో హిల్స్ ప్లాట్ ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా కు చెందింది. దీని విలువ 247.69 లక్షలు.  Also read: AP: సాగునీటి ప్రాజెక్టులపై జగన్ సమీక్ష..మే నాటికి పోలవరం పనుల పూర్తి