Raghuveera reddy: ఆయనొక మాజీ మంత్రి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు కూడా. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్‌కు అత్యంత సన్నిహితుడు. అయితే అతన్నిప్పుడు ఓ స్థంభానికి కట్టేశారు. ఆశ్చర్యంగా ఉందా..చూడండి మరి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, రెవిన్యూ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన ఎన్ రఘువీరారెడ్డి ఇప్పుడు సాదాసీదా జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రఘువీరారెడ్డి(Raghuveera reddy)చాలాకాలంగా రాజకీయాల్ని పక్కనపెట్టేశారు. ఇటీవలే పొలంలో వ్యవసాయం చేస్తూ పూర్తి రైతుగా కన్పించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. చాలామంది ఆయన్ని చూసి పోల్చుకోలేకపోయారు కూడా. ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ అభిమానుల్ని ఫిదా చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. ఈసారి వ్యవసాయం చేయడం లేదు మరేదీ చేయడం లేదు. ఆ ఫోటో చూస్తే ఒక్కసారిగా ఆందోళన కలుగుతుంది. 


మాజీ మంత్రి రఘువీరారెడ్డి(Raghuveera reddy tied with Rope) ఓ స్థంభానికి కట్టేసి ఉన్న ఫోటో ఇప్పుడు నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. స్థంభానికి కట్టేసి ఉన్న ఫోటోను స్వయంగా రఘువీరారెడ్డినే షేర్ చేశారు. అసలేం జరిగిందంటే..ఆయన మనవరాలు సమైరానే తాతయ్యను స్థంభానికి కట్టేసిందట. ఎందుకంటే తనతో ఆడుకోవడానికి సమయం కేటాయించడం లేదని అలిగిన మనవరాలు సమైరా..ఏకంగా తాతయ్యను కాస్సేపు తాళ్లతో ఓ స్థంభానికి కట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా రఘువీరారెడ్డి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ఆ ఫోటోను షేర్ చేశారు కూడా. తనకు సమయాన్ని కేటాయించడం లేదని అలిగిన ఆయన మనవరాలు సమైరా రఘువీరారెడ్డిని తాళ్లతో స్థంభానికి కట్టి వేసిన దృశ్యంపై సోషల్‌ మీడియా యూజర్లు స్పందిస్తున్నారు. తాళ్లతో కట్టేసి మరీ తనతో ఆడుకోమని డిమాండ్‌ చేయడం భలే వుంది. చాలా హృద్యంగా, కట్టిపడేసేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. డౌన్ టు ఎర్త్ అనేది రఘువీరారెడ్డికి సరిపోయే మాట అంటున్నారు.


Also read: PM Modi Tour: యూకే, ఇటలీలో భారతీయ సంతతి ప్రజల్ని కలుసుకున్న ప్రధాని మోదీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook