ఏపీలో ( Ap ) పాఠశాలల్నితెరిచేందుకు  ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అధికార్లతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నా...అన్ లాక్ 5 గైడ్ లైన్స్ ప్రకారమే తుది నిర్ణయం ఉండనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్ 19 ( covid19 ) కారణంగా పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా మూతపడ్డాయి. మార్చ్ నెల నుంచి మూతపడిన స్కూల్స్ ను తిరిగి తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్ 5 నుంచి తెరవాలని అనుకున్నా...వైరస్ సంక్రమణ ఆగకపోవడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు అక్టోబర్ 5 నుంచి తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( ap education minister admoolapu suresh ) తెలిపారు. అధికార్లతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అయితే అన్ లాక్ 5 గైడ్ లైన్స్  ( Unlock 5 guidelines ) వెలువడిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యార్ధులకు అందించే జగనన్న కానుకను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు మంత్రి సురేశ్. కరోనా అనంతరం కాలేజీలు, యునివర్సిటీల్లో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయని తెలిపారు. కరోనా తర్వాత పరిస్థితులు అంచనా వేసి అనేక మార్గదర్శకాలు సిద్దం చేశామని పేర్కొన్నారు. 


మరోవైపు ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని ఇప్పటికే సీఎం జగన్ ( ap cm ys jagan ) స్పష్టం చేశారని.. ఆ మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇది అభివృద్ది వికేంద్రీకరణ మాత్రమేనని..లక్ష కోట్లు ఒకే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదన్నారు. Also read: COVID-19 in AP: ఏపీలో ఆగని కరోనా విజృంభణ