AP: ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీకు అగ్రస్థానం
ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్ వెలువడ్డాయి. పెద్ద రాష్ట్రాల్ని వెనక్కి నెడుతూ...ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, తెలంగాణలు రెండు, మూడు స్థానాల్ని కైవసం చేసుకున్నాయి.
ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్ ( Ease of doing business rankings ) వెలువడ్డాయి. పెద్ద రాష్ట్రాల్ని వెనక్కి నెడుతూ...ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, తెలంగాణలు రెండు, మూడు స్థానాల్ని కైవసం చేసుకున్నాయి.
దేశీయ, ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల్ని ఆకర్షించడానికి, వాణిజ్య వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు , రాష్ట్రాల మధ్య పోటీ నెలకొల్పేందుకు ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ లు ప్రకటిస్తోంది. 2019 ర్యాంకింగ్స్ లో ( 2019 Rankings ) ఆంధ్రప్రదేశ్ తొలి స్థానం ( Ap in First place ) లో నిలవగా..ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలోనూ..తెలంగాణ మూడో స్థానంలోనూ నిలిచాయి. నాలుగేళ్లుగా ఈజ్ ఆఫ డూయింగ్ ర్యాంకింగ్స్ వెలువడుతున్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరుపై ఈ ర్యాంకింగ్స్ ఆధారపడి ఉంటాయి. ఇలాంటి ర్యాంకింగ్స్ అనేవి సంస్కరణల బాధ్యతల్ని మరింత లోతుగా ప్రబావితం చేస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, మరో మంత్రి హర్దీప్ సింగ్ పూరిలు సంయుక్తంగా ఈ ర్యాంకింగ్‌ను విడుదల చేశారు. వ్యాపార సంస్కరణల ప్రణాళిక అమలుపై ఈ ర్యాంకింగ్ నిర్ధారితమవుతుంది.
ఈ ర్యాంకింగ్ లను కార్మిక చట్టాలు, భూమి లభ్యత, నిర్మాణ అనుమతులు, పర్యావరణ పరిస్థితి, సమాచార లభ్యత, సింగిల్ విండో వ్యవస్థ వంటి ముఖ్యమైన ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తారు. అంతేకాకుండా వాణిజ్య సంస్కరణల్ని ఏ రాష్ట్రం ఎలా అమలు చేస్తుందనేదానిపై ఆధారపడి ఉంటుంది. Also read: AP Tourism: ఇకపై రిజిస్ట్రేషన్ తప్పనిసరి..కొత్త గైడ్ లైన్స్ జారీ