AP Tourism: ఇకపై రిజిస్ట్రేషన్ తప్పనిసరి..కొత్త గైడ్ లైన్స్ జారీ

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకం ఇకపై రిజిస్ట్రేషన్ కావల్సిందే. టూరిజం రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాల్ని రూపొందించింది ప్రభుత్వం. 

Last Updated : Sep 5, 2020, 04:25 PM IST
AP Tourism: ఇకపై రిజిస్ట్రేషన్ తప్పనిసరి..కొత్త గైడ్ లైన్స్ జారీ

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో పర్యాటకం ఇకపై రిజిస్ట్రేషన్ కావల్సిందే. టూరిజం రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాల్ని రూపొందించింది ప్రభుత్వం. 

ఏపీ పర్యాటక రంగం ( Ap Tourism Sector ) లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పర్యాటక కార్యకలాపాలకు రిజిస్ట్రేషన్ ( Registration Compulsory ) తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ( Ap Government )ఆదేశాలు జారీ చేసింది. టూరిజం ట్రేడ్ రిజిస్ట్రేషన్, ఫెసిలిటేషన్ పేరిట మార్గదర్శకాల్ని రూపొందించింది ఏపీ పర్యాటక శాఖ.గోవా,రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్నాటక తరహాలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యాటకులకు అందిస్తున్న సేవల్లో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఉంది. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మార్కెటింగ్ వ్యవస్థకు రూపకల్పన చేయాలని సూచనలు చేసింది. రాష్ట్రంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు, పరిశ్రమతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు నెలకొల్పేలా కార్యాచరణ చేపట్టాలని పేర్కొంది.

రాష్ట్రంలో అతి పొడుగైన తీరప్రాంతంతో పాటు నదులు, సుందరమైన ఇతర నీటి వనరులు, హిల్ స్టేషన్లు, అటవీ ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, బౌద్ధారామాలు ఉన్నందున పర్యాటక సేవల్ని వ్యవస్థీకరించేలా ఇకపై కార్యాచరణ ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. Also read: Jagananna Vidya kanuka: జగనన్న విద్యా కానుక పథకం వాయిదా

Trending News