ఉపాధి హామీలో ఏపీ టాప్ ; కేబినెట్ భేటీలో సీఎం అభినందనలు
అమరావతి: ఏపీ సచివాయంలో ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది
అమరావతి: ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల విషయంలోనూ ఏపీ సత్తా చాటింది. ఉపాధి హామీతో పాటు మొత్తం ఐదు విభాగాలలో ప్రధమ స్థానంలో నిలిచిన ఏపీ మరో ఆరు విభాగాలలో రెండవ స్థానంలో నిలిచింది.
ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు... సంబంధిత శాఖ మంత్రులు, అధికారులను అభినందించారు. కాగా సుమారు రెండు గంటల పాటు పలు అంశాలపై మంత్రి వర్గం సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితి, తాగునీటి ఎద్దడి, ఫొని తుపాను సహాయక చర్యలు, వాతావరణ పరిస్థితులు, ఉపాధి హామీ పనులపై చర్చించారు.