Covid19 Leaves: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు కేటగరీల్లో ఉండే ఈ సెలవులతో ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఆ సెలవులు ఇలా ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సంక్షోభ సమయంలో ఏపీ ప్రభుత్వం(Ap government) ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కరోనా వైరస్ బారిన పడితే 20 రోజుల వరకూ ప్రత్యేక సాధారణ సెలవులుంటాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 5 కేటగరీల్లో విభజించిన ఈ సెలవుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 


కరోనా బారినపడిన ప్రభుత్వ ఉద్యోగి హోం ఐసోలేషన్‌లో (Home Isolation) ఉంటే 20 రోజుల వరకూ కమ్యూటెడ్ సెలవులు ఇస్తారు. కమ్యూటెడ్ సెలవులు లేకపోతే 15 రోజులపాటు ప్రత్యేక సాధారణ సెలవులు ఇస్తారు. మిగిలిన ఐదు రోజుల్ని ఈఎల్, హెచ్‌పీ‌ఎల్ నుంచి తీసుకుంటారు. ఒకవేళ ఉద్యోగి ఆసుపత్రిలో చేరితే మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణైనప్పటి నుంచి 20 రోజులు సెలవులిస్తారు. ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబసభ్యుల్లో ఎవరికైనా కరోనా వైరస్ సంక్రమించినా సరే..15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులిస్తారు(Special General Leaves). కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన ఉద్యోగి హోం క్వారంటైన్‌లో ఉంటే 7 రోజులు వర్క్ ఫ్రం హోంగా(Work From Home)పరిగణిస్తారు. కంటైన్‌మెంట్ జోన్(Containment Zone)పరిధిలోని వ్యక్తి కరోనా వైరస్ బారినపడి క్వారంటైన్‌లో ఉంటే..ఆ ప్రాంతంలో కంటైన్‌మెంట్ తొలగించేవరకూ వర్క్ ఫ్రం హోంగా లెక్కించనున్నారు. మార్చ్ 25వ తేదీ నుంచే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఉత్తర్వుల వల్ల కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న మార్చ్ , ఏప్రిల్, మే నెలల్లో కోవిడ్ బారినపడిన ఎందరో ఉద్యోగులకు పెద్దఎత్తున ఉపశమనం లభించనుంది.


Also read: AP Police Jobs: ఏపీలో భారీగా పోలీసు ఉద్యోగాలు, ప్రతి యేటా 6 వేల 5 వందల పోస్టుల భర్తీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook