AP Exams: ఏపీలో పదవ తరగతి విద్యార్ధులకు గ్రేడ్లు కేటాయింపు, ఎలాగంటే
AP Exams: కరోనా సంక్షోభం కారణంగా ఏపీలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అందరూ ఉత్తీర్ణులైనట్టు ప్రకటించినా గ్రేడ్ విధానం ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఆ గ్రేడ్ విధానం ఎలా ఉంటుందంటే
AP Exams: కరోనా సంక్షోభం కారణంగా ఏపీలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అందరూ ఉత్తీర్ణులైనట్టు ప్రకటించినా గ్రేడ్ విధానం ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఆ గ్రేడ్ విధానం ఎలా ఉంటుందంటే..
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతి కారణంగా ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రతిష్ఠంభన నెలకొంది. చివరికి విద్యార్ధుల రక్షణను దృష్టిలో ఉంచుకుని పరీక్షల్ని రద్దు చేశారు. వార్షిక పరీక్షలు లేకుండానే అంతా ఉత్తీర్ణులైనట్టు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి కూడా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. విద్యా సంవత్సరంలో రాసిన సమ్మేటివ్, ఫార్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పదవ తరగతి గ్రేడ్లు ఇవ్వనున్నారు. గత ఏడాది కూడా కరోనా వైరస్ కారణంగా పరీక్షలు నిర్వహించలేక..అందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది ప్రభుత్వం. అప్పట్లో గ్రేడ్లకు బదులు పాస్ అని ఇచ్చారు. ఈసారి మాత్రం రెండు విద్యాసంవత్సరాలకు కలిపి గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం(Ap government) నిర్ణయించింది.
Also read: AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో వందల కోట్ల అవినీతి, సీఐడీ విచారణకు ఆదేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook