ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల పంచాయితీ మళ్లీ కోర్టుకెక్కింది. ఎన్నికల కమీషనర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ..ప్రభుత్వం హైకోర్టులో  హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికల కమీషనర్ ( SEC ) వర్సెస్ ఏపీ ప్రభుత్వ ( Ap Government ) వివాదం మరోసారి చర్చనీయాంశమవుతోంది. గ్రామ పంచాయితీ ఎన్నికల్ని నాలుగు దశల్లో నిర్వహించాలని నిర్ణయిస్తూ హఠాత్తుగా షెడ్యూల్  విడుదల చేశారు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar ). ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా ఏకపక్షంగా షెడ్యూల్ జారీ చేయడంతో ప్రభుత్వం ఆగ్రహం చెందింది. నిమ్మగడ్డపై పెద్దఎత్తున విరుచుకుపడ్డారు మంత్రులు. ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ( Ap cm Adityanath das ), ప్రభుత్వోద్యోగుల సంఘ నేతలు స్పష్టం చేశారు. 


ఇప్పుడు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar ) నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టు ( High court ) లో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల్ని కాదని..రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ప్రభుత్వం దాఖలు చేసుకున్న హౌస్ మోషన్ పిటీషన్‌పై సోమవారం నాడు విచారణ జరగనుంది. 


ఇప్పటికే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైఖరిపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ ( Corona virus ) ఉధృతి కొనసాగుతుంటే..మరోవైపు గ్రామ పంచాయితీ షెడ్యూల్ విడుదల చేయడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 


Also read: AP: పంచాయితీ ఎన్నికలపై మళ్లీ రాజుకున్న వివాదం, ఎస్ఈసీ నిర్ణయంపై విమర్శలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook