AP Exams: రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాల నిర్ణయాలతో సంబంధం లేదని వెల్లడించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి (Corona Pandemic) కారణంగా వరుసగా రెండవ విద్యా సంవత్సరం దెబ్బతింది. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్ని ఏపీ ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతిని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసింది. కొన్ని రాష్ట్రాలైతే ఏకంగా పరీక్షల్ని రద్దు చేశాయి. అయితే విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం రద్దు చేయడానికి సుముఖంగా లేదు. ప్రతిపక్షాలు ఈ విషయంపై రాద్ధాంతం చేస్తుండటంతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh) వివరణ ఇచ్చారు. 


రాష్ట్రంలో కరోనా వైరస్ (Coronavirus) పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల్ని నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విద్యార్ధుల భవిష్యత్‌ను పరిగణలో తీసుకుని పరీక్షల్ని నిర్వహిస్తామన్నారు. అయితే ప్రతిపక్షం విద్యార్ధుల పరీక్షల్ని కూడా రాజకీయం చేస్తోందని మంత్రి సురేశ్ విమర్శించారు. ఆపత్కాలంలో కూడా ఇలా వ్యవహరించడం తగదన్నారు. పరీక్షల్ని ఇతర రాష్ట్రాలు రద్దు చేస్తే..తామూ చేయాలా అని ప్రశ్నించారు.ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని ఆ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా అని నిలదీశారు. ఏపీలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జూలైలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల్ని ఆగస్టు నెలలో నిర్వహించే అవకాశాలున్నాయి. పదిహేను రోజుల ముందు పరీక్షలకు సంబంధించి ప్రకటన చేస్తామన్నారు. గత ఏడాది పరీక్షల్లేకుండా ప్రమోట్ చేయడంతో ఈ ఏడాది ఎలా ఉంటుందనే సందేహం నెలకొంది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అటు సీబీఎస్ఈ బోర్డు (CBSE Board) కూడా పదవ తరగతి పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేసింది. 12వ తరగతి పరీక్షల్ని రద్దు చేసింది.


Also read: AP Corona Update: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి, పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook