ఇక నుంచి అందరూ ట్రాఫిక్ పోలీసులే.. రూల్స్ ఉల్లంఘిస్తే ఇలా చేయండి
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఏపీ రవాణాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు చూస్తే ఫొటో తీసి రవాణాశాఖకు పంపవచ్చు. ఇందు కోసం రవాణాశాఖ 9542800800 ప్రత్యేక ఫోన్ నెంబర్ ను కేటాయించింది. సెప్టెంబర్ నుంచి ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం కానున్న క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మీరు చేయాల్సింది ఇదే..
మీ పరిసర ప్రాంతంలో లేదా ఎక్కడైనా ఎవరైనా సరే.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పాల్పడినట్లు చూస్తే ఫోటో తీసి ఈ నెంబర్ కు వాట్సాప్ చేస్తే చాలు ..రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పేర్ని నానీ పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారి ఇంటికే జరిమానా పంపుతామన్నారు.