రవాణాశాఖ కీలక నిర్ణయం; ఇక నుంచి `ఒక రాష్ట్రం-ఒక నంబర్ సిరీస్` అమలు
వాహనాల నెంబర్ ప్లేట్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి
విజయవాడ: వాహనాల నెంబర్ ప్లేట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రాష్ట్రం-ఒక నంబర్ సిరీస్ అమలు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఏపీ 39 సిరీస్ అమలు వస్తుంది. తాజా నిర్ణయంతో నేటి నుంచి అమ్ముడయ్యే అన్ని వాహనాలకు ఏపీ 39 సిరీస్ తో నంబర్ ప్లేట్లను జారీచేస్తారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణా మంత్రి అచ్చెన్నన్నాయుడు ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఏపీ 39 సిరీస్ లో తొలి నంబర్ ‘ఏపీ 39 0002’ను ఎం కల్పన అనే మహిళకు అందజేశారు. కాగా తాజా నిర్ణయంతో ఇప్పటివరకూ జిల్లాల వారీగా అమలు చేస్తున్న సిరీస్ విధానం ముగిసిపోనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక ఆర్టీసీ వాహనాలకు ఏపీ 39జెడ్, పోలీసుల వాహనాలకు ఏపీ 39పీ, రవాణా వాహనాలకు ఏపీ 39 టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్ లను కేటాయించామన్నారు.