Ysr Vahanamitra Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నోరకాల సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది. అటువంటి ఓ పథకంలో దరఖాస్తు చేసుకుంటే..10 వేల ఆర్ధిక సహాయం అందనుంది. ఆ స్కీమ్ వివరాలు, ఎలా దరఖాస్తు చేయాలి, అర్హులెవరో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 ఎన్నికల హామీల్లో భాగంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకం గురించి అందరికీ తెలిసిందే. నవరత్నాల పేరుతో అన్ని వర్గాలకు అవసరమైన విభిన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని మించి ప్రభుత్వం పలు సంక్షేమ పధకాలు ఇప్పటికే ప్రారంభించింది. నవరత్నాల్లో ఒకటి వైఎస్సార్ వాహనమిత్ర పథకం. 


వైఎస్సార్ వాహనమిత్ర పథకంలో భాగంగా అర్హులైనవారికి  ఒక్కొక్కరికీ 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందుతుంది. ఈ ఏడాదికి ఈ నెల 13వ తేదీ ఈ పధకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సొంత వాహనాలు ఆటో, ట్యాక్సీ, క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ఈ పధకం వర్తిస్తుంది. ఏడాదికి పదివేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ఇన్సూరెన్స్, ఫిట్నెస్, మరమ్మత్తుల నిమిత్తం ఇస్తున్నారు. అర్హులైన డ్రైవర్లు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


వైఎస్సార్ వాహనమిత్రకు ఎలా అప్లై చేయాలి, అర్హతలేంటి


వైఎస్సార్ వాహనమిత్ర పథకం కోసం ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం దరఖాస్తులు  ఆహ్వానిస్తోంది. ఈ నెల 7 వ తేదీవరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దీనికోసం దరఖాస్తుదారుడికి చెందిన భూమి, ఆస్థి, పన్ను, విద్యుత్ బిల్లు, ఆదాయపు పన్ను, కులం వివరాలకు సంబంధించిన కాగితాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత లబ్దిదారులు వాహనంతో పాటు ఫోటో తీసుకుని గ్రామ సచివాలయంలో అప్‌లోడ్ చేయాలి. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. విద్యుత్ వినియోగం ఆరు నెలల సగటులో నెలకు 3 వందల యూనిట్లు దాటకూడదు.


Also read: Kotamreddy Sridhar Reddy: డ్రైనేజీలోకి దూకిన వైసీపీ ఎమ్మెల్యే... సీఎం జగన్ పై అలా కసి తీర్చుకున్నారా?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook