ఏపీలో మిగులు విద్యుత్ ఉందా..లేదా..?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉందా.. లేదా అన్న అంశంపై ప్రస్తుతం పలు విమర్శలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉందా.. లేదా అన్న అంశంపై ప్రస్తుతం పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో మిగులు విద్యుత్ ఉందని.. ఇంధనాన్ని ఎప్పటికప్పుడు సేవ్ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా, కొన్ని సంస్థలు చేసిన పరిశోధనల్లో మాత్రం వెలుగుచూస్తున్న నిజాలు వేరే విధంగా ఉన్నాయి. ఇటీవలే ‘ప్రయాస్’ అనే సంస్థ ప్రకటించిన నివేదిక ప్రకారం ప్రభుత్వం ఉదారంగా విద్యుత్ సబ్సిడీలు ఇవ్వడం వల్ల ఇంకో ఐదారేళ్ళల్లో ఇదే రంగం రూ.32,100 కోట్ల ఆర్థిక లోటు బారిన పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీఈఆర్‌సీ కమిటీ మీటింగ్‌కి హాజరైన ఈ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, తాము చెబుతున్న గణాంకాల వల్ల రానున్న కాలంలో రాష్ట్రం విద్యుత్ విషయంతో తీవ్రమైన నష్టాన్ని పొందే అవకాశం ఉందని తెలిపారు. అయితే ప్రయాస్ నివేదికను సీఎండీ కె.విజయానంద్ ఖండించారు. నివేదికలో వెలిబుచ్చిన అభిప్రాయాలు సరైనవి కాకపోవచ్చని చెప్పారు.