Holidays 2023: 2023 సంవత్సరం సెలవుల్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, మొత్తం ఎన్నంటే
Holidays 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 సాధారణ సెలవుల్ని ప్రకటించింది. కొత్త సంవత్సరంలో మొత్తం 23 రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయని వెల్లడిస్తూ..సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి ఏటా విడుదల చేసే సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం ఈసారి కొద్దిగా ముందుగానే ప్రకటించింది. జాతీయ సెలవులు, పండుగలు కలిపి మొత్తం 23 సాధారణ సెలవుల్ని ఇస్తున్నట్టుగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు మీ కోసం..
ఏపీ ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితా విడుదల చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 2692 జారీ చేసింది. జనవరి 14, 15, 16 సంక్రాంతి సెలవుల్ని సాధారణ సెలవుల్లో చేర్చింది. భోగి, సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి పండుగలు రెండవ శనివారం, ఆదివారం వచ్చాయి. మార్చ్ 22న ఉగాది సెలవుగా ప్రకటించారు. రంజాన్, బక్రీద్, మొహర్రం, మీలాద్ ఉన్ నబి తేదీల్లో మార్పులు చేర్పులు జరిగాయి.
రంజాన్, బక్రీద్ మొహర్రం, మీలాద్ ఉన్ నబీ పర్వదినాలు, తిధుల్ని బట్టి హిందూ పండుగల్లో మార్పులుంటే తరువాత పత్రికా ప్రకటన ద్వారా సరిచేస్తారు. అంటే మొత్తంగా 2023 సంవత్సరంలో 23 సాధారణ సెలవులున్నాయి. నాలుగు పండుగ సెలవులు అంటే భోగి పండు జనవరి 14 రెండవ శనివారం, సంక్రాంతి జనవరి 15 ఆదివారం, దుర్గాష్టమి అక్టోబర్ 22 ఆదివారం, దీపావలి నవంబర్ 12న ఆదివారం వచ్చాయి. సాధారణ సెలవులతో పాటు ఉద్యోగులకు లభించే ఆప్షనల్ హాలిడేస్ కూడా నోటిఫికేషన్‌లో ఉన్నాయి.
జనవరి 1 న్యూ ఇయర్, ఫిబ్రవరి 5 హజ్రత్ అలీ పుట్టిన రోజు, మార్చ్ 7 షబే బరాత్, ఏప్రిల్ 4 మహావీర్ జయంతి, ఏప్రిల్ 18 షబే ఖదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఏప్రిల్ 21 జుమాతుల్ విదా ఏప్రిల్ 23 బసవ జయంతి, ఏప్రిల్ 24 హజ్రత్ అలీ షహాదత్, మే 5 బుద్ధ పూర్ణిమ, జూలై 28 మొహర్రం కూడా ఐఛ్ఛిక సెలవులుగా ఉన్నాయి.
Also read: Visakhapatnam Woman: గంజాయి మత్తులో యువతి అర్ధరాత్రి హల్‌చల్.. బీర్ బాటిల్‌తో ఏఎస్ఐపై దాడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook