ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో భారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలల్లో మొత్తం 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు భర్తీ కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, టీచింగ్ ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన ఈ ఖాళీల నియామక ప్రక్రియ జరగనుంది. మెడికల్ పీజీ కలిగిన విద్యార్ధులు ఈ పోస్టులకు అర్హులు. డిసెంబర్ 7వ తేదీలోగా అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 


ఏయే విభాగాల్లో ఖాళీలు


సీటీ సర్జరీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జీఈ, మెడికల్ ఆంకాలజీ, నియో నాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ జీఈ, సర్జికల్ ఆంకాలజీ, ఎనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్ టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఆర్ధోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ ఇలా దాదాపు అన్ని విభాగాల్లో ఖాళీలున్నాయి. 


పోస్టు                                  అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖాళీలు                              631
అర్హత                                 సంబంధిత విభాగంలో పీజీ
వయస్సు                           గరిష్టంగా 42 సంవత్సరాలు
దరఖాస్తు విధానం              ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు                   1000 రూపాయలు, రిజర్వేషన్ కేటగరీకు 500 రూపాయలు
ఎంపిక విధానం                 సాధించిన మార్కులు, అనుభవం, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్
దరఖాస్తుల స్వీకరణ         డిసెంబర్ 1, 2022 నుంచి
దరఖాస్తుల చివరి తేదీ      డిసెంబర్ 7, 2022


మరిన్ని ఇతర వివరాలకు  https://dme.ap.nic.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుక ఇదే వెబ్‌సైట్ అని గ్రహించగలరు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసేందుకు మరో నాలుగు రోజులే గడువు మిగిలుంది. 


Also read: AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook