Pensions Distribution: ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాలంటీర్లతో పింఛన్ల పంపిణీకు అభ్యంతరం తెలుపుతూ మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల కోడ్ ముగిసేవరకూ ఏపీలో వాలంటీర్లతో పింఛన్ల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు చేయవద్దని, ఆ విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కోడ్ ముగిసేవరకూ వాలంటీర్ల నుంచి ఫోన్‌లు, ట్యాబ్ లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. దాంతో రేపు జరగాల్సిన పింఛన్ల పంపిణీకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపధ్యంలో పించన్ల పంపిణీ ఆగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. కోడ్ ముగిసేవరకూ అంటే మే, జూన్ రెండు నెలల పింఛన్లు ఇంటింటికీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వెల్లడించింది. ఈ రెండు నెలలు పింఛన్ల పంపిణీ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. 


ఎన్నికల సంఘం ఆదేశాలతో వాలంటీర్లను దూరంగా ఉంచడం వల్ల ఈ రెండు నెలలు పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పింఛన్ల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లి పింఛన్ తీసుకోవాలని సూచించింది. 


వాలంటీర్ల పనితీరుపై వస్తున్న ఫిర్యాదులు, వివిధ మీడియా కధనాలు, మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా వాలంటీర్లను సంక్షేమ పథకాల అమలుకు దూరంగా ఉంచాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. 


Also read: Nara Lokesh Security: లోకేశ్‌కు జెడ్ కెటగరీ భద్రత, కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook