Nara Lokesh Security: ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు తెలుగుదేశం-జనసేన-బీజేపీలు కూటమిగా ఏర్పడిన తరువాత కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగరీ భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలను లోకేష్ భద్రతకు నియమిస్తున్నట్టుగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
వాస్తవానికి నారా లోకేశ్‌కు భద్రత పెంచాలని తెలుగుదేశం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2016లో ఆంద్రా ఒరిస్సా బోర్డర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ నేపధ్యంలో లోకేష్ భద్రత అంశం తెరపైకి వచ్చింది. అప్పటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ మేరకు సిపారసు చేసింది. కానీ 2019 ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం లోకేశ్ భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫారసుల్ని పక్కనబెట్టి వై కేటగరీ భద్రతకు పరిమితం చేసింది.
నారా లోకేష్‌కు ప్రాణ హాని ఉందని సెక్యూరిటీ రివ్యూ కమిటీ చాలాసార్లు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. లోకేష్‌కు తగిన భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖకు లోకేశ్ భద్రతా సిబ్బంది 14 సార్లు లేఖలు రాశారు. గతంలో మావోయిస్టు హెచ్చరికలు, భద్రతా పరంగా నిఘా వర్గాల సమాచారం పరిశీలించిన కేంద్ర హోంశాఖ లోకేశ్‌కు జెడ్ కేటగరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Also read: Election Commission: వాలంటీర్లతో డబ్బు పంపిణీకు నో, ఈసారి పింఛన్లు ఆలస్యమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook