Oxygen Production: కరోనా మహమ్మారి ఉధృతంగా విజృంభిస్తుండటంతో దేశంలో ఆక్సిజన్, మందులు, బెడ్స్ కొరత తీవ్రంగా మారింది. ఈ  తరుణంలో ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్టీల్‌ప్లాంట్, నేవీ అదికారుల సహాయం తీసుకోనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)విలయతాండవం సృష్టిస్తోంది. ఆక్సిజన్ అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి.ఈ నేపధ్యంలో ఆక్సిజన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Ap government) ప్రత్యేక చర్యలకు దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan) ఆదేశాలమేరకు..స్టీల్‌ప్లాంట్, నేవీతో అధికారులు చర్చలు జరిపారు. అన్ని ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణను విశాఖ తూర్పు నావికా దళం(East Naval Command) చేపట్టింది. ఆక్సిజన్ ప్లాంట్ లీకేజీలు, స్థితిగతులు, నిర్వహణకు ఈస్ట్ నేవల్ కమాండ్ ముందుకొచ్చింది. అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు కానున్నాయి. అవసరైన చోట ఈ బృందాల్ని విమానాల్లో పంపించనున్నారు. ఆక్సిజన్ ప్లాంట్లలోని (Oxygen Plants) సాంకేతిక లోపాల్ని సవరించేందుకు నేవీ సహాయం చేయనుంది. సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా నుంచి ఏపీకు ఆక్సిజన్‌తో కూడిన 25 క్రయోజనిక్ కంటైనర్స్ తరలించేందుకు నేవీ అంగీకరించింది. ఐఎన్ఎస్ కళింగ ఆసుపత్రిలో 60 బెడ్స్ కేటాయించనుంది. మరోవైపు కంచరపాలెంలో 150 బెడ్స్ ఆసుపత్రికి మౌళిక సదుపాయాల కల్పనకు నేవీ అంగీకారం తెలిపింది. ఈ ఆసుపత్రిలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని ప్రభుత్వం సమకూరుస్తుంది. 


ఇక గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్ చికిత్స కోసం ఆక్సిజన్‌తో కూడిన 50 బెడ్స్ ఆసుపత్రి ఏర్పాటుకు విశాఖ స్టీల్‌ప్లాంట్ సిద్ధమైంది. అదనంగా మరో 150 బెడ్స్ ఏర్పాటు చేయనున్నారు. మే 15వ తేదీకు ఇవి అందుబాటులో వస్తాయని స్టీల్‌ప్లాంట్ సీఎండీ వెల్లడించారు. మే 30 నాటికి 250 బెడ్స్ ఆసుపత్రి, జూన్ నాటికి 6 వందల బెడ్స్ అందుబాటులో రానున్నాయి. నేవీ, స్టీల్‌ప్లాంట్ ( Vizag Steel plant) అధికారుల విజ్ఞప్తి మేరకు కుటుంబ సభ్యులు, ఉద్యోగుల కోసం 4 వేల వ్యాక్సిన్స్ కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ( Ap government) స్టీల్‌ప్లాంట్, ఈస్ట్ నేవల్ కమాండ్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. 850 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు యూనిట్లకు కేవలం 100 మెట్రిక్ టన్నుల ఎంఎల్ఓ ఉత్పత్తి అవుతుందని స్టీల్‌ప్లాంట్ అధికారులు తెలిపారు. 


Also read: Ap Government: కరోనా విషయంలో దుష్ప్రచారంపై ప్రభుత్వం ఆగ్రహం, కఠిన చర్యలకు సిద్ధం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook