Ap Government: కరోనా విషయంలో దుష్ప్రచారంపై ప్రభుత్వం ఆగ్రహం, కఠిన చర్యలకు సిద్ధం

Ap Government: కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని దేశం ఓ వైపు అల్లాడుతుంటే మరోవైపు ఇదే పనిగా కట్టడి చర్యలపై దుష్ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లో మీడియా అదే పనిగా చేస్తున్న ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2021, 10:30 AM IST
Ap Government: కరోనా విషయంలో దుష్ప్రచారంపై  ప్రభుత్వం ఆగ్రహం, కఠిన చర్యలకు సిద్ధం

Ap Government: కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని దేశం ఓ వైపు అల్లాడుతుంటే మరోవైపు ఇదే పనిగా కట్టడి చర్యలపై దుష్ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లో మీడియా అదే పనిగా చేస్తున్న ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది.

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఇప్పటికే కరోనా వైరస్( Corona Virus) అంటేనే భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి తోడు కరోనా విషయంలో సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో దుష్ప్రచారం ఎక్కువవుతోంది. ఇలాంటి ప్రచారం వల్ల ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎల్లో మీడియా ప్రచారం ఎక్కువగా ఉంది. కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination), కట్టడి చర్యలపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చంద్రబాబు(Chandrababu naidu), ఒక వర్గం మీడియా ప్రచారాలపై ఫిర్యాదుల నేపథ్యంలో చట్టప్రకారం చర్యలకు ఉపక్రమించింది. దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది. విపత్తు సమయంలో దురుద్దేశ పూర్వక ప్రచారాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

వాస్తవాలను పక్కనబెట్టి.. ప్రజలను తప్పుదోవపట్టించేలా వ్యాక్సినేషన్‌పై కథనాలు, ప్రచారాలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా తప్పుడు ప్రచారాలు , విపత్తు సమయంలో సేవలందిస్తున్న సిబ్బంది నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేస్తున్న దుష్ప్రచారాలపై ఏపీ ప్రభుత్వం(Ap government) చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్ 440 కే వైరస్( N440 K Virus) సంక్రమించిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుపై కూడా కేసులు నమోదయ్యాయి.

Also read: India Corona Update: కొనసాగుతున్న కరోనా ఉధృతి, అత్యధికంగా 4.14 లక్షల కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News