Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ వయస్సును (Retirement age) 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ..జగన్ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం సంతకం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల నూతన పీఆర్సీ జీవోల విడుదల సందర్భంగా  ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. దీంతో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ (Governor Bishwabhushan Harichandan) సంతకం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పించనున్నారు. 


కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు: బొత్స
కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే కమిటీ వేశామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.


Also Read: Gannavaram Airport: గన్నవరం ఎయిర్ పోర్టులో భారీగా పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook