Gannavaram Airport: గన్నవరం ఎయిర్ పోర్టులో భారీగా పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు..

Gannavaram Airport: గన్నవరం ఎయిర్ పోర్టులో భారీగా పొగమంచు కురుస్తోంది. దీంతో పలు  విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 10:39 AM IST
  • గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు
  • విమానాల రాకపోకలకు అంతరాయం
Gannavaram Airport: గన్నవరం ఎయిర్ పోర్టులో భారీగా పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు..

Gannavaram Airport: గన్నవరం విమానాశ్రయాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఎయిర్ పోర్ట్ రన్‌వేపై పొగమంచు ఎక్కువగా ఉండడంతో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు తీవ్ర ఇబ్బందులు (Flight Services Interrupted) ఎదురయ్యాయి. దీంతో రన్ వే పై దిగేందుకు వీలు లేక ఎయిర్ ఇండియా, బెంగళూరు విమానాలు గాల్లో చక్కెర్లు కొట్టాయి. ఢిల్లీ నుండి గన్నవరం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం.. సుమారు గంట సేపు ఐదు రౌండు గాల్లో చక్కర్లు కొట్టి.. హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైంది. 

బెంగళూరు నుండి విజయవాడ వచ్చిన ఇండిగో విమానం కూడా సుమారు గంటన్నర సేపు గాల్లో చకెర్లు కొట్టి..హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైంది.  ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు (Gannavaram Airport) వచ్చిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి హైదరాబాద్ లో సేఫ్ గా ల్యాండ్ అయింది. ఈ పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. మంచు తగ్గి..పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్ కు అనుమతి ఇస్తామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. 

Also Read: Budget 2022: నేటి నుంచి పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాలు- విపక్షాల అస్త్రాలు రెడీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News