AP Tenth Exam Results: జూన్ మొదటి వారానికి పదవ తరగతి పరీక్షా ఫలితాలు
AP Tenth Exam Results: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షా ఫలితాలపై అప్‌డేట్ విడుదలైంది. జూన్ మొదటి వారానికి పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది
AP Tenth Exam Results: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షా ఫలితాలపై అప్‌డేట్ విడుదలైంది. జూన్ మొదటి వారానికి పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది.
ఏపీలో ఇప్పటికే పదవ తరగతి పరీక్షలు ముగిశాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ముగియబోతున్నాయి. రేపటితో అంటే మే 19తో ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు ముగియనున్నాయి. ఇవాళ్టితో మొదటి సంవత్సరం కూడా ముగియాల్సి ఉన్నా..అసని తుపాను కారణంగా వాయిదా పడిన పరీక్ష మే 25న నిర్వహించనున్నారు. ఇక పదవ తరగతి పరీక్షా ఫలితాల్ని త్వరగా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే పదవ తరగతి పరీక్షాల వ్యాల్యుయేషన్ జరుగుతోంది. ఈ నెలాఖరునాటికి వ్యాల్యుయేషన్ పూర్తి చేసి..5-6 రోజుల్లో అంటే జూన్ మొదటి వారానికి పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. పదవ తరగతి పరీక్షల ఫలితాల ఆధారంగానే ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలుంటుంటాయి. గత రెండేళ్లుగా పదవ తరగతి పరీక్షలు జరగనందున ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కొనసాగాయి. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు సవ్యంగానే జరిగినందున..ఆ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు జరగనున్నాయి. రూరల్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులకు వెయిటేజ్ ఉంటుంది. రాష్ట్రంలో ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ప్రాంగణాల్లో 4 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు, ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను త్వరగా ముగించేందుకు పదవ తరగతి పరీక్షా ఫలితాలు త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ మొదటివారానికి అంటే 7-8 తేదీల్లో ఫలితాలు విడుదల కానున్నాయని తెలుస్తోంది.
Also read: YSRCP Candidates: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook