Electricity Charges: డిసెంబర్ నుంచి ఏపీలో భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
Electricity Charges: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచనుంది. ఇప్పటికే వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలకు తోడు మరో భారం పడనుంది. డిసెంబర్ నెల నుంచి ఏపీలో విద్యుత్ ఛార్జీలు తడిసి మోపెడు కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Electricity Charges: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బాదుడు ప్రారంభించేసింది. ముందుగా విద్యుత్ ఛార్జీల్ని పెంచనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి 6072.86 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఈఆర్‌సి అనుమతి ఇచ్చింది. దాంతో ఏడాదిన్నరపాటు అదనపు ఛార్జీల పేరిట వసూలు చేసేందుకు ఏపీ విద్యుత్ శాఖ సిద్ధమౌతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై ఆరోపణలు చేసిన తెలుగుదేశం అధికారంలో వచ్చాక అదే పని చేస్తోంది. ఇప్పటికే అడపా దడపాపెరిగిన, అదనపు ఛార్జీలతో సతమతమౌతున్న వినియోగదారుడిని కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇస్తోంది. విద్యుత్ ఛార్జీలు పెంచుతోంది. ప్రజలపై 6072.86 కోట్ల భారం మోపేందుకు సిద్ధమైంది. ఈఆర్‌సి ఈ మేరకు డిస్కంలకు అనుమతిచ్చేసింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ వసూళ్లకు ఏపీ ఈఆర్‌సి అనుమతించింది. వాస్తవానికి డిస్కంలు 8,114 కోట్లు ప్రతిపాదిస్తే 6072 కోట్లకు అనుమతి లభించింది. దీని ప్రకారం డిసెంబర్ నెల నుంచి ఏడాదిన్నర వరకూ యూనిట్‌పై అదనంగా 1.21 రూపాయలు వసూలు చేసుకోవచ్చు. అంటే 200 యూనిట్లు వినియోగమైతే నెలకు 250 రూపాయల వరకూ బిల్లు పెరుగుతుంది.
ఎస్‌పీడీసీఎల్ పరిధిలో నెలకు యూనిట్‌కు అత్యధికంగా 0.83 పైసలు, సీడీపీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు 0.79 పైసలు, ఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు 0.80 పైసలు పెంచుకోవచ్చు. ఇప్పటికే 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించి ఇంధన సర్దుబాటులో భాగంగా యూనిట్‌కు 40 పైసలు, 65 పైసలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడిక డిసెంబర్ నెల నుంచి మరో 1.21 రూపాయలు పెరగనుంది. అంటే డిసెంబర్ నుంచి నెలకు యూనిట్‌పై అదనంగా 2.26 రూపాయలు వసూలు చేయనున్నారు.
Also read: Diwali Rangoli Designs: దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకునే రంగోళి డిజైన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.