Diwali Rangoli Designs: దీపావళి సమీపిస్తోంది. దేశంలోని హిందూవులంతా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ. ఉత్తరాది పెద్ద పండుగ ఇదే. అందుకే దీపావళి వస్తే చాలు ఇళ్లన్నీ మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులతో, దీపాలతో అలంకరిస్తుంటారు. వీటికి తోడు రంగు రంగుల ముగ్గులు ఇంటి పెరట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. మీరు కూడా మీ ఇంటిని అందంగా అలంకరించేందుకు మీ కోసం 5 అందమైన దీపావళి రంగోలీ డిజైన్లు...
Diwali Rangoli Designs: దీపావళికి రంగోళి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ప్రజలు తమ ఇళ్లను అందమైన రంగోలీ డిజైన్లతో అలంకరిస్తుంటారు. దీపావళి పురస్కరించుకుని మీ ఇంటిని అందంగా మార్చేందుకు కొన్ని దీపావళి డిజైన్లు ఇలా ఉన్నాయి.
Artificial Rangoli Design మీకు సమయంతో పాటు తగిన వస్తువులు లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ డిజైన్ అమర్చుకోవచ్చు. దీనికోసం మీక్కావల్సిందల్లా ఆర్టిఫిషియల్ పూలు. కొన్ని గాజులు, ఆర్టిఫిషియల్ దీపాలు, మీకు నచ్చినట్టుగా లేకపోతే ఇలా ఈ ఫోటోలో చూపించినట్టుగా అమర్చుకుంటే చాలు ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది.
Spiral Rangoli Design ఇది అత్యంత సులభమైందే కాకుండా వేగంగా వేయగలిగే రంగోళి డిజైన్. దీనికోసం 3-4 రంగులు కావల్సి ఉంటాయి. ఒక టూత్ పిక్ అవసరం. టూత్ పిక్ సహాయంతో రంగులు వెదజల్లవచ్చు. ఈ రంగోళి పెద్దదిగా ఉంటుంది. ఇంటికి అందాన్ని తెచ్చిపెడుతుంది
Leafy Rangoli Design ఆకులతో రంగోలి డిజైన్ మరో బెస్ట్ ఆప్షన్. ఇందులో ఆకుపచ్చ ప్రధాన రంగు. మరో 2-3 రంగులుంటాయి. ఇతర రంగులు కూడా వాడవచ్చు. ఆకుల ఆకృతిపై దీపాలు అమర్చుకోవచ్చు.
Floral Rangoli Design రంగులతో ముగ్గులు వేయడంలో నిష్ణాతులైతే ఈ డిజైన్ బాగుంటుంది. ఇందులో యూనిట్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంటుంది. మల్టీ కలర్స్ ఉంటాయి. ఎక్కువ స్థలం ఉంటే డిజైన్ మరింత ఆకర్షణీయంగా వస్తుంది. అంచుల్లో దీపాలు అమర్చుకోవచ్చు.
Flower Rangoli Design రంగులతో మంచి రంగోళి డిజైన్ వేయలేకుంటే పువ్వులతో రంగోళి వేయవచ్చు. దీనికోసం పసుపు, ఆరెంజ్ రంగుల్లోని బంతి పూలు అద్భుతంగా పనిచేస్తాయి. దీనికితోడుగా లిల్లీ పూలు, గులాబీలు ఉండాలి. పూవుల్ని వృత్తాకార వరుసల్లో అమర్చుకోవాలి. సింగిల్ ఫ్లవర్ రంగోలి అద్భుతంగా ఉంటుంది.