Ap New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త జిల్లాలపై వచ్చిన అభ్యంతరాల మేరకు స్వల్ప మార్పులతో గెజిట్ జారీ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కొత్త జిల్లాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలకు ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా కొత్తగా 72 రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి జిల్లాకు 18-20 లక్షలు జనాభా ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి జిల్లాకు 2-3 రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జిల్లాలు ఏర్పర్చింది. అయితే అరకు విస్తీర్ణం ఎక్కువ కావడంతో ఆ నియోజకవర్గాన్ని రెండుగా విభజించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా 284 అంశాలపై ప్రజల్నించి 17 వేల 5 వందలకు పైగా సూచనలు వచ్చాయి.


ప్రజల్నించి వచ్చిన సూచనల్ని సమీక్షించి స్వల్ప మార్పులతో కొత్త జిల్లాల్ని ఖరారు చేసింది. తిరుపతి కేంద్రంగా ప్రతిపాదించిన బాలాజీ జిల్లా పేరును మాత్రం అక్కడి ప్రజల కోరిక మేరకు తిరుపతిగానే ఉంచింది. మన్యం జిల్లాకు పార్వతీపురం మన్యం పేరును ఖరారు చేసింది. 21 కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. ప్రాధమిక నోటిఫికేషన్ ప్రకారం పేర్కొన్న జిల్లాల పరిధిలోని మండలాల్లో కొన్ని మార్పులు జరిగాయి. ప్రతిపాదిత మండలాలు అటూ ఇటూ మారాయి. 


1. శ్రీకాకుళం జిల్లా
ముఖ్య పట్టణం: శ్రీకాకుళం
మండలాలు: 30
రెవెన్యూ డివిజన్లు: పలాస , టెక్కలి, శ్రీకాకుళం, 


2. విజయనగరం జిల్లా
ముఖ్య పట్టణం: విజయనగరం
మండలాలు: 27
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి, చీపురుపల్లి , విజయనగరం


3. పార్వతీపురం మన్యం జిల్లా
ముఖ్య పట్టణం: పార్వతీపురం
మండలాలు: 14
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ, పార్వతీపురం


4. అల్లూరి సీతారామరాజు జిల్లా
ముఖ్య పట్టణం: పాడేరు
మండలాలు: 22
రెవెన్యూ డివిజన్లు: పాడేరు, రంపచోడవరం


5. విశాఖపట్నం జిల్లా
ముఖ్య పట్టణం: విశాఖపట్నం
మండలాలు : 11
రెవెన్యూ డివిజన్లు: భీమునిపట్నం, విశాఖపట్నం


6. అనకాపల్లి జిల్లా
ముఖ్యపట్టణం: కేంద్రం: అనకాపల్లి
మండలాలు: 24
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం, అనకాపల్లి


7. కాకినాడ జిల్లా
ముఖ్య పట్టణం : కాకినాడ
మండలాలు: 21
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం, కాకినాడ


8. కోనసీమ జిల్లా
ముఖ్య పట్టణం: అమలాపురం
మండలాలు: 22
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట


9. తూర్పు గోదావరి జిల్లా
ముఖ్య పట్టణం: రాజమహేంద్రవరం
మండలాలు: 19
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం, కొవ్వూరు


10. పశ్చిమ గోదావరి జిల్లా
ముఖ్య పట్టణం: భీమవరం
మండలాలు: 19
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, భీమవరం


11. ఏలూరు జిల్లా
ముఖ్య పట్టణం: ఏలూరు
మండలాలు: 28
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు


12. కృష్ణా జిల్లా
ముఖ్య పట్టణం: మచిలీపట్నం
మండలాలు: 25
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు


13. ఎన్టీఆర్‌ జిల్లా
ముఖ్య పట్టణం: విజయవాడ
మండలాలు: 20
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, నందిగామ, తిరువూరు


14. గుంటూరు జిల్లా
ముఖ్య పట్టణం: గుంటూరు
మండలాలు: 18
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు, తెనాలి


15. బాపట్ల జిల్లా
ముఖ్య పట్టణం: బాపట్ల
మండలాలు: 25
రెవెన్యూ డివిజన్లు : బాపట్ల, చీరాల 


16. పల్నాడు జిల్లా
ముఖ్య పట్టణం: నరసరావుపేట
మండలాలు: 28
రెవెన్యూ డివిజన్లు: గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి


17. ప్రకాశం జిల్లా
ముఖ్య పట్టణం: ఒంగోలు
మండలాలు: 38
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి


18. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ముఖ్య పట్టణం: నెల్లూరు
మొత్తం మండలాలు: 38
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు , ఆత్మకూరు, కావలి, కందుకూరు


19. వైఎస్సార్‌ కడప జిల్లా
ముఖ్య పట్టణం: కడప
మండలాలు 36
రెవెన్యూ డివిజన్లు : కడప, జమ్మలమడుగు, బద్వేలు


20. అన్నమయ్య జిల్లా
ముఖ్య పట్ణణం: రాయచోటి
మండలాలు: 30
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట, రాయచోటి, మదనపల్లి


21. అనంతపురం జిల్లా
ముఖ్య పట్టణం: అనంతపురం
మండలాలు: 31
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్‌ 


22. శ్రీ సత్యసాయి జిల్లా
ముఖ్య పట్టణం: పుట్టపర్తి
మండలాలు: 32
రెవెన్యూ డివిజన్లు : ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తి , కదిరి


23. కర్నూలు జిల్లా
ముఖ్య పట్టణం: కర్నూలు
మండలాలు: 26
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు, ఆదోని, పత్తికొండ 


24. నంద్యాల జిల్లా
ముఖ్య పట్టణం: నంద్యాల
మండలాలు: 29
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల, డోన్‌, ఆత్మకూరు 


25. చిత్తూరు జిల్లా
ముఖ్య పట్టణం: చిత్తూరు
మండలాలు: 31
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి


26. తిరుపతి జిల్లా
ముఖ్య పట్టణం: తిరుపతి
మండలాలు: 34
రెవెన్యూ డివిజన్లు : సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి


Also read: IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు, కొత్త జిల్లాలకు ఎస్పీలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి