Vizag Shifting: ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎక్కడి నుంచైనా పరిపాలించే హక్కుండటంతో అందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. విశాఖ రుషికొండపై ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాట్లు దాదాపుగా పూర్తికావచ్చాయి. దసరా నాటికి విశాఖకు షిఫ్టింగ్ కావడం మిగిలిందిక. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుకున్నట్టుగానే విశాఖకు షిఫ్ట్ కానున్నారు. దసరా నాటికి విశాఖ నుంచిం పరిపాలన ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపు కూడా జరుగుతోంది. సీఎంవో షిప్టింగ్‌కు సంబంధించి మౌలిఖ సదుపాయాలు, మంత్రుల నివాసాల కోసం ప్రభుత్వం కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి జీవో నెంబర్ 2015 విడుదల చేసింది ప్రభుత్వం. 


ఈ కమిటీలో పట్టణాభివృద్ధి, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ధిక శాఖ కార్యదర్శులుంటారు. ఏపీ రీ ఆర్గనైజింగ్ చట్టానికి లోబడి సామరస్య పూర్వక, సమతుల్యాభివృద్దికి తీసుకున్న నిర్ణయంగా జీవోలో ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలుగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఆరోగ్యం, విద్యా, ఇరిగేషన్, కనెక్టివిటీ పరంగా వెనుకబడి ఉన్నాయని జీవోలో ప్రభుత్వం ప్రస్తావించింది. ఉత్తరాంధ్ర ప్రాంత సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. 


ఇప్పుడు జీవో నెంబర్ 2015 కూడా విడుదల కావడంతో ఇక విశాఖకు తరలింపు అనేది లాంఛనంగానే మిగిలింది. రుషికొండలో పనులు కొలిక్కి వచ్చిన వెంటనే విశాఖకు షిప్టింగ్ ఉంటుంది. 


Also read: MLA Kotamreddy: నోట్లో వేలు.. చెవిలో పూలతో టీడీపీ వినూత్న నిరసన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook