Navaratnalu Calendar Release: దేశంలోనే అత్యధికంగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏ నెలలో ఏ పధకాల అమలు చేస్తున్నారనేది ప్రజలకు అవగాహన కోసం ప్రత్యేకంగా నవరత్నాలు క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల్ని(Welfare schemes) ప్రజల ముంగిటకే చేరుస్తోంది ప్రభుత్వం. నెలల వారీగా అమలుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్‌కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా నవరత్నాల (Navaratnalu)ద్వారా మహిళలతో సహా పేదలు, అట్టడుగు, బలహీన వర్గాల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి జి.విజయ్‌ కుమార్‌ తెలిపారు.


సంక్షేమ పథకాలను ఒక క్రమ పద్థతిలో నిర్మాణాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం (Ap government) నిర్ణయించిందని, ఇందులో భాగంగానే 2021–22 సంవత్సరానికి సంబంధించి నెలల వారీగా వార్షిక క్యాలెండర్‌ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక తదితర పథకాలతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్యాలెండర్‌ రూపొందించారు.


ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ సున్నా వడ్డీ, డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పధకాల్ని అమలు చేయనున్నారు. మే నెలలో వైఎస్సార్ ఉచిత పంటల భీమా, వైఎస్సార్ రైతు భరోసా, మత్స్యకార భరోసా పథకాల్ని, జూన్‌లో జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ చేయూత పథకాలు, జూలైలో జగనన్న విద్యాకానుక రెండవ విడత, వైఎస్సార్ వాహన మిత్ర, వైఎస్సార్ కాపు నేస్తం పథకాల్ని, ఇలా ఏ నెలలో ఏ పథకాల్ని అమలు చేసేది ముందుగానే షెడ్యూల్ విడుదల  చేసింది ప్రభుత్వం. 


Also read: Ugadi Happy New Year: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు, ప్రధాని తెలుగులో ట్వీట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook