Amaravathi: అమరావతిపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కీలకమైన అంశాలతో అఫిడవిట్ సమర్పించింది. నాలుగేళ్ల గడువు కావాలని కోరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ మూడు రాజధానుల అంశంపై దాఖలైన వివిధ పిటీషన్లపై విచారణ పూర్తి చేసిన ఏపీ హైకోర్టు మూడు రాజధానుల చట్టం చెల్లదని తీర్పు ఇచ్చింది. రైతులకు నెలరోజుల్లోగా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలని..ఆరు నెలల్లో అమరావతిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. ఇది అసాద్యమని..నాలుగేళ్ల గడువు తప్పకుండా కావాలని కోరుతూ అఫిడవిట్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. 


ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ..అమరావతి తీర్పుకు సంబంధించి 190 పేజీల కీలకమైన అఫిడవిట్ సమర్పించారు. హైకోర్టు తీర్పు అమలు చేసేందుకు నాలుగేళ్లు గడువు కోరారు. వాస్తవానికి సీఆర్డీఏ చట్టం ప్రకారం చూసినా..2024 వరకూ అమరావతి అభివృద్ధికి అవకాశముందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆరు నెలల్లోగా అమరావతి అభివృద్ధి అనేది అసాధ్యమని తేల్చిచెప్పింది ప్రభుత్వం. ఇప్పటికే హైకోర్టు తీర్పును తప్పుబట్టడంతో పాటు అసెంబ్లీ నిర్ణయాల్లో ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రభుత్వ నేతలు స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ కూడా జరిగింది. మరోవైపు హైకోర్టు చెప్పినట్టుగా రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. 


Also read: Ys jagan and KCR: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్, కేసీఆర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook