Ugadi Wishes: తెలుగు ప్రజలు ఉగాది శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు అందించారు.
ఇవాళ ఉగాది. తెలుగు ప్రజల సంవత్సరాది. తెలుగు కొత్త సంవత్సరం ఇవాళ్టి నుంచే ప్రారంభం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు అందించారు. పేరులోనే శుభాన్ని మోసుకొస్తున్న శుభకృత్ నామ సంవత్సరం..రాష్ట్ర ప్రజలకు అన్ని రంగాల్లో ఫలప్రదంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దేవుని దయతో పుష్కలంగా నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు కేసీఆర్. తెలుగునాట వ్యవసాయపనులు ఉగాది నుంచే ప్రారంభమవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ సాగునీరు, తాగునీరుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు.
శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు కలగాలని..సమృద్ధిగా వర్షాలు కురవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుకున్నారు. ఉగాది పురస్కరించుకుని ఇవాళ తాడేపల్లిలో జరిగే వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల 36 నిమిషాలకు పంచాంగ పఠనంలో పాల్గొంటారు. పంచాంగ పఠన కార్యక్రమాన్ని పూర్తిగా పల్లె వాతావరణంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వానలు కురవాలని..వైఎస్ జగన్ కోరుకున్నారు. పంటలు బాగా పండాలని..అన్నదాతలతో పాటు అన్ని వృత్తులవారికి మేలు చేకూరాలన్నారు.
Also read; Ugadi 2022 Panchangam: పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? లేదా?.. ఉగాది పంచాంగం ఏం చెబుతోందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook