AP Government: సుప్రీంకోర్టులో విచారణ అనంతరం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్ని ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇప్పుడీ రెండు పరీక్షల ఫలితాల విషయంలో కీలక ప్రకటన విడుదల చేసింది. ఫలితాల విడుదలపై నిర్ణయం వెలువరించాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్ని(Ap Exams) పలు జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచన. అయితే సుప్రీంకోర్టులో ఈ అంశంపై జరిగిన విచారణ, జరిగిన పరిణామాలతో ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడిక ఫలితాలు విడుదల కావల్సి ఉన్నాయి. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఏ ప్రాతిపదికన విడుదలే చేయలనేది నిర్ణయించనున్నారు. ఫలితాల విడుదల కోసం హై పవర్ కమిటీ ఏర్పాటు చేశామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు  3-4 రోజుల్లో కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందుతుందని మంత్రి తెలిపారు. సుప్రీంకోర్టు (Supreme Court) జోక్యం లేకుంటే రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెలలోనే జరిగుండేవి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ సూచనల మేరకు విద్యార్ధులకు మార్కులు ప్రకటించనున్నారు. ఆగస్టు నెలలో సెట్ పరీక్షల్ని నిర్వహిస్తామని..రెండో వారంలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని మంత్రి ఆదిమూలపు సురేష్ (Ap minister Adimulapu suresh) తెలిపారు. తరగతులు నిర్వహించనప్పుడు కేవలం 70 శాతం ఫీజులే తీసుకోవాలని ఆదేశించామన్నారు.రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ ఏడాది ఫీజుల్ని నిర్ణయిస్తుందన్నారు. కమిటీ నిర్ణయించిన ప్రకారమే ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజులుంటాయన్నారు.


Also read: AP Corona Update: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కేవలం 3.26 శాతమే పాజిటివిటీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook