AP Government: కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 40 బెడ్స్ ఆసుపత్రుల్ని కోవిడ్ ఆసుపత్రులుగా మార్చడమే కాకుండా..ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)శరవేగంగా విస్తరిస్తోంది.ఇటు ఏపీలో సైతం ప్రతిరోజూ 10 వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆక్సిజన్, బెడ్స్ , మందుల కొరత లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని 40 పడకల ఆస్పత్రులను కోవిడ్ హాస్పిటల్స్‌గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ( Ap government) చర్యలు చేపట్టింది. నియోజకవర్గ కేంద్రాల్లో కాలేజీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.


మరోవైపు రోజుకు 12వేల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు(Remdesivir injections) రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టడమే కాకుండా..మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం రేపు భేటీ కానుంది. మరోవైపు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Ap cm ys jagan) మంగళవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, నివారణకు ముందు నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఈ ప్రక్రియలో మరో ముందడుగు వేసింది. కోవిడ్‌ ఆస్పత్రులు (ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం టేకోవర్‌ చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల వద్ద మంచి వైద్యం, ఆక్సిజన్, ఆహారం, మందులు, నీరు, పారిశుద్ధ్యం లాంటివి సక్రమంగా ఉన్నాయా లేవా అనేది పరిశీలించనున్నారు.


Also read: Covid Review: ఏపీలో ఆక్సిజన్ , రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదు : మంత్రి ఆళ్ల నాని


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook