ఆ అనాధ పిల్లల చదువుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
Ap Government: కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు దిక్కుతోచకుండా మిగిలిపోయారు. అనాధలై, సహారా కోల్పోయిన చిన్నారుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Ap Government: కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు దిక్కుతోచకుండా మిగిలిపోయారు. అనాధలై, సహారా కోల్పోయిన చిన్నారుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
కరోనా మహమ్మారి(Corona Pandemic) కారణంగా అనాధలైన పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా పిల్లల చదువుకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది. 2020-21లో కోవిడ్ కారణంగా 6 వేల 8 వందలమంది చిన్నారులు తల్లి లేదా తండ్రిని లేదా ఇద్దరినీ కోల్పోయారు. అనాధలైన చిన్నారులు ఎక్కైతే చదువుతున్నారో అక్కడే కొనసాగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల చదువుకు ఇబ్బంది కలిగితే ఉచిత నిర్భంధ విద్యాహక్కు చట్టం కింద అక్కడే చదువు చెప్పించనుంది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన 6 వేల 8 వందలమంది చిన్నారుల్లో 4 వేల 333 మంది పిల్లల పూర్తి వివరాల్ని అధికారులు సేకరించారు. వీరిలో 1659 మంది ప్రభుత్వ పాఠశాలల్లోనూ, 2 వేల 150 మంది ప్రైవేటు విద్యాసంస్ధల్లోనూ చదువుతున్నారు. మరో 524 మంది శిశువులున్నారు. మరోవైపు ఈ నెల 16 నుంచి స్కూల్స్ ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారుల(Orphan Children)వివరాల్ని ఆయా విద్యాసంస్థలు ప్రభుత్వ ఛైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాల్సి ఉంటుంది. పిల్లలు ఏ పాఠశాలల్లో చదువుతుంటే అక్కడే కొనసాగించాలి. ఫీజు చెల్లించలేదనే కారణంతో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్ధుల్ని తొలగించకూడదు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పిల్లల చదువును నిరాటంకంగా కొనసాగించేలా చూడాలి. జగనన్న విద్యాకానుక కింద మూడు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, షూ, సాక్స్, బెల్ట్, డిక్షనరీల్ని మొదటి ప్రాధాన్యతగా అందించాలి. ఇదే విషయమై ఇప్పటికే పిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగేలా చూడాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు(Ap Government) మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ బాలల హక్కుల సంరక్ష కమీషన్ కూడా ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసింది.
Also read: మందుబాబులకు ఏపీ సర్కారు షాక్: ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క లిక్కర్ బాటిల్ కూడా తెచ్చేందుకు అనుమతి లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook