AP Three Capitals: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల నిర్మాణం విషయంలో ప్రతిష్ఠాత్మకమైన ఆ సంస్ఖకే అప్పగిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రముఖ ఆంగ్లపత్రిక కధనం ప్రచురించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక తీసుకున్న కీలకమైన నిర్ణయం రాష్ట్రానికి మూడు రాజధానులు(Ap Three Capital)ఏర్పాటు చేయడం. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నంలను ప్రభుత్వం ప్రకటించింది.అయితే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో..ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టులో విచారణలో ఉంది. మరోవైపు ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా ఒక్కొక్క అడుగూ ముందుకేస్తోంది.ఇప్పటికే విశాఖపట్నంలో కొన్ని కీలక నిర్మాణాలు చేపట్టింది.


ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)రాజధాని నగరాల నిర్మాణం విషయంలో ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక పార్లమెంట్ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు చేస్తున్న ప్రముఖ ఆర్కిటెక్టు బిమల్ పటేల్ సేవల్ని ఏపీ ప్రభుత్వం వినియోగించుకోనున్నట్టు తెలిసింది. ఈ మేరకు ద హిందూ ఆంగ్ల పత్రిక ఓ కథనం ప్రచురించింది. మూడు రాజధానుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, అసెంబ్లీ భవన నిర్మాణంలో బిమల్ పటేల్ సేవల్ని ఉపయోగించుకోనున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. అటు బిమల్ పటేల్(Bimal Patel)కూడా ఈ విషయాన్ని దాదాపుగా ధృవీకరించారు. ఇప్పటివరకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెస్ట్‌హౌస్ ప్రాజెక్టు పనులను మాత్రమే చూస్తున్నామని.. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక, అధికారికంగా మిగతా ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టడం సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వ(Ap government) అధికారులు చెప్పారని బిమల్ పటేల్ తెలిపారు. 


కళ్లు చెదిరే రూపంతో నిర్మించబోతున్న పార్లమెంట్ సెంట్రల్ విస్టా పనుల్ని(Parliament Central Vista Project) బిమల్ పటేల్ సంస్థే చూస్తోంది. ప్రభుత్వ భవనాల నిర్మాణంలో బిమల్ పటేల్ సంస్థకు అపార అనుభవముంది. అందుకే బిమల్ పటేల్ సంస్థను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థను విశాఖపట్నంకు తరలించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కోర్టులో కేసు ఉన్నప్పటికీ..మూడు రాజధానుల ప్రణాళిక మాత్రం ముందుకే సాగుతోంది. అమరావతిలో సేకరించిన భూముల్లో అసెంబ్లీ భవనాల నిర్మాణం, కర్నూలులో హైకోర్టును నిర్మించనున్నారు. ఏపీ మూడు రాజధానుల నిర్మాణ పనులు బిమల్ పటేల్ సంస్థకు అప్పగించడం నిజంగా ఓ మంచి పరిణామమని పలువురు విశ్లేషిస్తున్నారు. 


Also read: Axis Bank Bumper Offer: యాక్సిస్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్, 12 నెలలు ఈఎంఐ మాఫీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook