AP Government: ఏపీలో విద్యాశాఖలో సమూల మార్పులు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో సీబీఎస్ఈ విధానం అమలు కానున్న నేపధ్యంలో ఆ దిశగా సిలబస్ మార్పుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా 8వ తరగతి సిలబస్ మార్చనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం(Ap government) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం అమలు చేయనున్న నేపధ్యంలో విద్యారంగంలో కీలక మార్పులు తీసుకొస్తోంది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విధానం అమలు కానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 1 నుంచి 7వ తరగతి వరకూ ఉన్న పాఠ్యపుస్తకాల సిలబస్‌ను మార్చి అమల్లో తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కూడా ఏర్పాటు చేసినందున విద్యార్ధులకు బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాల్ని రూపొందించి పంపిణీ చేశారు. ఇప్పుడు 8వ తరగతి సిలబస్‌ను(8th Class Syllabus Change)సీబీఎస్ఈ విధానానికి అనుగుణంగా మార్పు చేసి..వచ్చే విద్యాసంవత్సరంలో కొత్త పాఠ్యపుస్తకాల్ని అందించనున్నారు. ఈ నెల 21న విద్యావేత్తలు, నిపుణులతో జరగనున్న సదస్సులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh)దిశానిర్దేశం చేయనున్నారు.


ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా సీబీఎస్ఈ(CBSE)విధానం అమలు చేయనుంది. దీనికోసం ఇప్పటికే సీబీఎస్ఈ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న పాఠశాలల్ని ఎంపిక చేసి ముందుగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1092 స్కూళ్లను గుర్తించారు. ఇందులో మోడల్ స్కూళ్లు 164, ఎపీఆర్ఐఈ సొసైటీ స్కూళ్లు 50, బీసీ వెల్ఫేర్ స్కూళ్లు 78, కేజీబీవీలు 352, ఎంపీపీ, జడ్పీ స్కూళ్లు 126, మున్సిపల్ స్కూళ్లు 5, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు 180, ప్రభుత్వ స్కూళ్లు 4, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లు 126, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ స్కూళ్లు 7 ఉన్నాయి. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నాడు-నేడు (Nadu Nedu Program)కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూల్ స్థాయితో తీర్చిదిద్దుతూ అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నారు. 


Also read: Punjab Politics: త్వరలో కెప్టెన్ అమరిందర్ సొంత పార్టీ , బీజేపీతో పొత్తుకు సంసిద్ధత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook