Data security: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ డేటా భద్రతపై ప్రత్యేకంగా స్టేట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. విశాఖలో ప్రైమరీ సైట్, కడపలో డిజాస్టర్ రికవరీ సైట్ సిద్ధం కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సైబర్ నేరాల ద్వారా ప్రభుత్వ డేటా( Government Data )చోరీ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టనుంది. ప్రభుత్వ డేటా స్టోరేజ్ కోసం సొంతంగా స్టేట్ డేటా సెంటర్ ( State Data Centre ) ఏర్పాటు చేయబోతోంది. దీనికోసం 153 కోట్లు కేటాయించింది. విశాఖపట్నంలో 83.4 కోట్లతో ప్రైమరీ డేటా సైట్, 69.67 కోట్లతో కడపలో డిజాస్టర్ రికవరీ సైట్‌ను ఏర్పాటు చేయనుంది.  ఈ గవర్నెన్స్‌లో భాగంగా వెబ్‌సైట్స్, అప్లికేషన్ల నిర్వహణను ఏపీ టెక్నాలజీస్ ( Ap Technologies )‌కు బదిలీ చేయనుంది.  ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఆర్ధిక శాఖ ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. స్టేట్ డేటా సెంటర్‌ను ఏడాది వ్యవధిలో అందుబాటులో తీసుకురావాలన్నది లక్ష్యంగా ఉంది. సొంతంగా డేటా సెంటర్ వల్ల డేటా సురక్షితంగా ఉండటమే కాకుండా..నిర్వహణ వ్యయం భారీగా తగ్గనుంది. ఎందుకంటే ప్రస్తుతం డేటా నిర్వహణకు ప్రేవేట్ సంస్థల్నించి క్లౌడ్ సర్వీసులు వినియోగించుకుంటే ఐదేళ్లకు 795 కోట్ల వరకూ ఖర్చవుతుంది. స్టేట్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఈ ఖర్చును 570 కోట్లకు పరిమితం చేయవచ్చు. 


డేటా భద్రత ( Data Security )కు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న అప్లికేషన్లను ఏపీ స్టేట్ డేటా సెంటర్‌కు మార్చ్ 31లోగా బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 32 ప్రభుత్వ శాఖలు ఈ గవర్నెన్స్ ( E Governance )‌లో భాగంగా బయటి సంస్థలు అభివృద్ధి చేసిన అప్లికేషన్లు, హోప్టింగ్ డేటా వినియోగిస్తున్నారు. వీటన్నింటినీ సెక్యూరిటీ ఆడిటింగ్ చేసి స్టేట్ డేటా సెంటర్‌లోకి మార్చనున్నారు. ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న ఐటీ అప్లికేషన్లు, వెబ్‌సైట్స్, యాప్స్‌లలో తీసుకోవల్సిన భద్రతా చర్యలకు సంబంధించి స్పష్టమైన నిబంధలు జారీ అయ్యాయి.


Also read: Ap High court: ఆ అధికారం ఎన్నికల కమీషనర్‌కు ఎక్కడిది..ఎక్కడి నుంచి వచ్చింది ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook