AP: ఇక 45 రోజులపాటు రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు
AP: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో బాగా విమర్శలకు లోనవుతున్న విషయం అధ్వాన్నంగా ఉన్న రోడ్లు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏపీ రోడ్లకు మోక్షం కలిగింది. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభించనున్నారు.
AP: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో బాగా విమర్శలకు లోనవుతున్న విషయం అధ్వాన్నంగా ఉన్న రోడ్లు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏపీ రోడ్లకు మోక్షం కలిగింది. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో వైఎస్ జగన్ అధికారంలో వచ్చాక సాధారణ ప్రజల్నించి సైతం ఎక్కువగా విమర్శలు చెలరేగిన విషయం ఒక్కటే. అది రాష్ట్రవ్యాప్తంగా అధ్వాన్నంగా ఉన్న రోడ్లు. ఎక్కడ చూసినా..ఏ జిల్లా చూసినా రోడ్లు దుస్థితి ఒక్కటే. ఇప్పుడీ రోడ్లకు మోక్షం కలిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) రోడ్ల పరిస్థితిపై స్పందించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. జనవరి 10 నుంచి 45 రోజుల పాటు రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తు పనులు ( Road Damage works ) చేపట్టాలని ఆదేశించారు.
రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి 560 కోట్లకు జనవరి 10వ తేదీలోగా టెండర్లు పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వంలో చివరి రెండేళ్లు పట్టించుకోకపోవడం, వైసీపీ అధికారంలో వచ్చాక భారీ వర్షాలు పడటంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ యేడాది అంతా రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెడతామని..మరో 2 వేల కోట్లు కూడా కేటాయించనున్నట్టు చెప్పారు.
Also read: Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలక ఘట్టం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook