Oxygen plants: ఏపీ ప్రభుత్వం ఆక్సిజన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పెద్దఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసం భారీగా నిధుల్ని కేటాయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో...రాష్ట్రంలో కరోనా వైరస్(Corona Virus)కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో వరుసగా నాలుగవరోజు కూడా 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ లభ్యత, సరఫరా, ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఇప్పుడు మరింతగా దృష్టి పెడుతోంది.


రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల(Oxygen Plants) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ​ ప్రభుత్వం (Ap government) భారీగా నిధులు కేటాయించింది. 3 వందల కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 49 చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, 50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.10 వేల అదనపు ఆక్సిజన్‌ పైప్‌లైన్లను ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే 6 నెలల్లో 60 లక్షల రూపాయలు మంజూరు చేసింది. మరోవైపు ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 9 మంది సభ్యులతో ప్రత్యేక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇన్‌ఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు బాథ్యతలు అప్పగించారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్నించి వస్తున్న ఆక్సిజన్‌ను ఆయనే పర్యవేక్షిస్తారు. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాపై దృష్టి సారించనున్నారు.


Also read: E-Pass System: ఏపీలో అత్యవసర ప్రయాణాలకు మళ్లీ ఈపాస్ విధానం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook