ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ( Ap cm ys jagan ) అధ్యక్షతన జరిగిన కేబినెట్ ముగిసింది. పలు కీలకాంశాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా వైఎస్సార్ ఆసరా పధకానికి కేబినెట్ ఆమోదం పలికింది.  సెప్టెంబర్ 11 నుంచి వైఎస్సార్ ఆసరా పధకం ప్రారంభం కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ( Ap secretariat ) జరిగిన ఏపీ కేబినెట్ ( Ap cabinet meet ) పలు కీలకాంశాలకు ఆమోదముద్ర వేసింది. నవరత్నాల్లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ వైఎస్సార్ ఆసరా పధకానికి ( ysr aasara scheme ) ప్రదానంగా ఆమోదం తెలిపింది కేబినెట్. సెప్టెంబర్ 11 నుంచి ఈ పధకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పధకం ద్వారా నాలుగేళ్లలో డ్వాక్రా మహిళలకు 27 వేల కోట్లకు పైగా లబ్ది చేకూరనుంది. దీంతోపాటు ఇటీవల ప్రతిపాదించిన నూతన పారిశ్రామిక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు సెప్టెంబర్ 1 న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం, సెప్టెంబర్ 5న వైఎస్సార్ విద్యాకానుక ( ysr vidya kanuka ) పథకాలను ప్రారంభించనున్నారు. దీంతోపాటు పంచాయితీ రాజ్ శాఖలోని 51 డివిజల్ డవలప్ మెంట్ అధికార్ల పోస్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 


వైఎస్సార్ విద్యాకానుక పధకం కింద 43 లక్షల మంది విద్యార్ధులకు స్కూల్ యూనిఫామ్ లు, షూ, బెల్ట్ లు అందించనున్నారు. వైఎస్సార్ కడప జిల్లా ఎలక్ట్రానికి పార్క్ ఏర్పాటుకు సంబంధించిన రైట్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. Also read: AP: వరద పరిస్థితులపై సీఎం జగన్ ఏరియల్ సర్వే