AP New Medical Colleges: రాష్ట్రంలో 5 కొత్త వైద్య కళాశాలల్లో వచ్చే ఏడాది నుంచే అడ్మిషన్లు
AP New Medical Colleges: ఏపీలో వైద్య విద్యకు మహర్దశ పడుతోంది. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభిస్తున్న 5 వైద్య కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న ఐదు వైద్య కళాశాలల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు కళాశాలలకు అనుమతులు రాగా..ఇంకొన్ని కళాశాలల అనుమతులు రావల్సి ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో కొత్తగా 17 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని కళాశాలల నిర్మాణం ప్రారంభమైంది. కొన్ని కళాశాలలకు కేంద్రం నుంచి అనుమతులు మంజూరు కాగా..మరి కొన్ని వైద్య కళాశాలలకు అనుమతులు రావల్సి ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. వచ్చే ఏడాది నుంచి కొత్తగా 5 వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. ఇందులో భాగంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి 5 వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు మొదలు కానున్నాయి. 2024-25 నుంచి మరో ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు జరగవచ్చు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2023-24 నుంచి నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జిల్లాల్లోని జిల్లా బోధనాసుపత్రులుగా తీర్చిదిద్దనున్నారు. మచిలీపట్నం మినహాయించి మిగిలిన నాలుగు ప్రాంతాల్లో నిర్మాణాలు వేగంగా జరగనున్నాయి. ఫలితంగా వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి.
ఇక 2024-25 నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యే వైద్య కళాశాలల్లో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ఉన్నాయి. పాడేరులో ఇప్పటికే ఉన్న 150 పడకల ఆసుపత్రికి అదనంగా 330 పడకలు ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన మరో 7 వైద్య కళాశాలల్ని 2025-26లో ప్రారంభించవచ్చు.
కొత్త వైద్య కళాశాలల్లో ఎకాడమిక్ కార్యకలాపాలపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వచ్చే ఏడాది విద్యా సంవత్సరంలో ఈ 5 వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా రానున్న మూడేళ్లలో 750, 750 , 1050 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో రానున్నాయి.
Also read: Viveka Muder Case: వివేకా హత్యకేసులో కీలక పరిణామం, ఈ నెల 10వ తేదీన నిందితుల హాజరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook