Mid Day Meals: ఏపీలో మరో పధకం, రేపట్నించి ఇంటర్ విద్యార్ధులకు సైతం మిడ్ డే మీల్స్
Mid Day Meals: ఇంటర్మీడియట్ విద్యార్ధులకు శుభవార్త, ఏపీ ప్రభుత్వం కీలకమైన పధకం ప్రారంభించనుంది. రేపటి నుంచి ఇంటర్ విద్యార్ధులకు సైతం మద్యాహ్న భోజనం అందించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mid Day Meals: ఏపీలో రేపటి నుంచి మరో పథకం అమలు కానుంది. జూనియర్ కళాశాలల్లో మద్యాహ్నం భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత మద్యాహ్న భోజనం అందించనున్నారు.
మద్యాహ్న భోజన పధకం ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న పధకమే. కానీ ఎక్కడైనా సరే కేవలం పాఠశాల విద్యార్ధులకే పరిమితంగా ఉంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తొలిసారిగా ఈ పధకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్ధులకు కూడా విస్తరించనుంది. ఈ మేరకు జీవో విడుదల చేసిన ప్రభుత్వం 115 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలనున్నాయి. వీటన్నింటిలో రేపటి నుంచి మిడ్ డే మీల్స్ ప్రారంభం కానుంది. ఆర్ధికపరమైన కారణాలతో పేద విద్యార్ధులు ఇంటర్ విద్యకు దూరం కాకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఈ పధకాన్ని ప్రారంభిస్తోంది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 40 జారీ అయింది. దారిద్రరేఖకు దిగువన ఉన్న విద్యార్ధులకు పధకం అందుతుంది. ఈ పధకంలో భాగంగా మద్యాహ్నం సమయంలో పౌష్టికాహారం అందుతుంది.
పౌష్ఠికాహారం అందించడం వల్ల విద్యార్ధి దశ నుంచే మంచి ఆహారపు అలవాట్లు అలవడనున్నాయి. ఈ పధకం అమలు చేసేందుకు వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 85.84 కోట్లు కేటాయించింది.
Also read: Liquor Sales: మందుబాబులకు శుభవార్త, ఇక ఆర్ధరాత్రి 1 గంట వరకూ కిక్కే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.