Ap Government: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్టే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం..కీలక నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ (Corona virus) ప్రారంభమై సరిగ్గా ఏడాది తరువాత మరోసారి కలకలం రేగుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే..మహారాష్ట్రలో మరీ ప్రమాదకరంగా మారింది. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించగా, ఢిల్లీ ప్రభుత్వం సైతం లాక్‌డౌన్ విధించేందుకు ఆలోచిస్తోంది. ఉన్నత స్థాయి సమావేశం అనంతరం నిర్ణయం తీసుకోనుంది. అటు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష (KCR Review) అనంతరం కీలక నిర్ణయం తీసుకోనున్నారు.


తెలంగాణలో గత 24 గంటల్లో 370 వరకూ కొత్త కరోనా కేసులు నమోదు కాగా..ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి. ఈ నేపధ్యంలో కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం (Ap government) కీలకమైన నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమలు కానుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ (Adimulapu Suresh) తెలిపారు. ఉదయం 7 గంటల 45 నుంచి 12 గంటల 30 నిమిషాల వరకూ తరగతులుంటాయని చెప్పారు. 


ఓ వైపు కరోనా కేసులు, మరోవైపు ఎండల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. పాఠశాల విద్యార్ధులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులే శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్ధులకు కోవిడ్ పరీక్షల్ని నిర్వహించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించడంపై చర్యలు తీసుకోవాలన్నారు. 


Also read: Lockdown: ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్, ఉన్నత స్థాయి సమావేశం అనంతరం నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook