కొత్త కరోనా వైరస్ ( New coronavirus ) కలకలం సృష్టిస్తోంది.  యూకేలో ప్రారంభమైన వైరస్...దేశంలో నెమ్మదిగా విస్తరిస్తోంది. యూకే టు ఏపీ రిటర్న్స్‌లో కరోనా నిర్ధారణైనవారి సంఖ్య పెరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


యూకే ( UK ) నుంచి ఆంధ్రప్రదేశ్‌ ( Andhra pradesh ) కు చేరుకున్నవారి సంఖ్య 1363కు పెరిగింది. యూకే నుంచి ఏపీ వచ్చినవారితో పాటు ..వారితో కాంటాక్ట్‌లో ఉన్నవారు కలుపుకుని 23 మందికి కరోనా పాజిటివ్‌గా ( Corona virus positive ) నిర్ధారణైంది. ఇప్పటి వరకూ 1346 మంది యూకే రిటర్న్స్‌ను ట్రేస్ చేయగా..మిగిలిన 17 మంది కోసం ట్రేసింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. యూకే నుంచి వచ్చినవారిలో అయితే 11 మందికి కరోనా నిర్ధారణైంది. వీరితో కాంటాక్ట్‌లో  ఉన్నవారిలో 12 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. మొత్తం 23 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే వీరిలో కొత్త కరోనా స్ట్రెయిన్ ( New coronavirus strain ) ఉందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. 


రాష్ట్రంలో అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. యూకే నుంచి వచ్చినవారి కాంటాక్ట్స్‌లో మొత్తం 5 వేల 784 మందికి పరీక్షలు నిర్వహించారు. గుంటూరులో అత్యధికంగా 8 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురికి, నెల్లూరులో ఒకరికి యూకే రిటర్న్స్‌ ద్వారా సంక్రమితమైంది. 


Also read: AP: రైతు భరోసా, నివర్ తుపాను నష్ట పరిహారం రేపే అన్నదాతల ఖాతాల్లోకి