AP Governor: రెండు ఎమ్మెల్సీ ఖాళీలు భర్తీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయ్యాయి. ప్రభుత్వం సిఫార్సు మేరకు ఉన్న రెండు ఖాళీల్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నామినేట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయ్యాయి. ప్రభుత్వం సిఫార్సు మేరకు ఉన్న రెండు ఖాళీల్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నామినేట్ చేశారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఖాళీల ( Ap Mlc Vacancy ) భర్తీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) సమన్యాయం పాటించారు. గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఖాళీల్ని మైనార్టీ, ఎస్సీలతో భర్తీ చేశారు. మైనార్టీల నుంచి జకియా ఖానం ( Zakia Khanum ), ఎస్సీ కోటా నుంచి మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు ( Ex Mp Pandula Ravindra Babu ) ను ఎమ్మెల్సీలుగా గవర్నర్ నామినేట్ చేసేశారు. 2011లో వైఎస్సార్ సీపీను స్థాపించినప్పటి నుంచి జగన్ అంటే తనకు చాలా ఇష్టమని..2014లో వైఎస్సార్ సీపీ ( Ysrcp ) నుంచి పోటీ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యానని పండుల రవీంద్రబాబు స్పందించారు. వైసీపీ అంటే దళిత, మైనార్టీల పార్టీ అని మరోసారి రుజువైందని చెప్పారు.
యావత్ మైనార్టీల తరపున సీఎం జగన్ కు ధన్యవాదాలు అర్పించారు మరో ఎమ్మెల్సీగా ఎన్నికైన జకియా ఖానం. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్న వైఎస్ జగన్ నేతృత్వంలో పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటూ...పార్టీ శ్రేయస్సుకు పని చేస్తానన్నారు. Also read: AP: రాజధాని రైతుల వ్యవహారం కాదు..ప్రజల హక్కు