వాటి రద్దుపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
తెల్ల రేషన్ కార్డుల రద్దుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో బియ్యం కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్లు.. అర్హులను, అక్రమంగా రేషన్ తీసుకుంటున్నవారిని గుర్తించారని మంత్రి తెలిపారు.
అమరావతి: తెల్ల రేషన్ కార్డుల రద్దుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో బియ్యం కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్లు.. అర్హులను, అక్రమంగా రేషన్ తీసుకుంటున్నవారిని గుర్తించారని మంత్రి తెలిపారు. మొత్తం కోటీ 47 లక్షల 23 వేల 567 రేషన్ కార్డుల్లో.. 10 లక్షల మంది రేషన్ షాపుల నుంచి బియ్యాన్ని తీసుకోవడం లేదన్నారు. మరో లక్షమందికి పైగానే అనర్హులను ప్రభుత్వం గుర్తించిందన్నారు.
రేషన్ బియ్యంతో అన్నం వండితే ముద్దలా అవుతున్నాయని ప్రజలు చెప్పడంతో, నాణ్యమైన బియ్యాన్ని ప్యాకింగ్ చేసి బియ్యం కార్డుల ద్వారా అర్హులకు అందిస్తామన్నారు. కాగా, బియ్యంతో పాటు పంచదార, గోధుమలు, పామాయిల్, చిరు ధాన్యలు, ఇతర నిత్యావసర సరుకులు కూడా లభ్యమవుతాయన్నారు.
ఈ నెల 15వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురానుందని ఆయన తెలిపారు. మార్చి నుంచి బియ్యం కార్డులని పంపిణీ చేస్తామన్నారు. కేవలం ఈ కార్డు మీద రేషన్ సరుకులు మాత్రమే వస్తాయని, మిగిలిన పథకాలకు ఆయా కార్డులను త్వరలోనే జారీ చేస్తామని పేర్కొన్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..