Andhra Volunteers : వాలంటీర్లకు మరో షాకిచ్చిన చంద్రబాబు సర్కారు ..ఆ అలవెన్సుల నిలిపివేత..
AP Volunteers: ఏపీ వాలంటీర్లకు చంద్రబాబు సర్కారు మరో దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పటికే తమ ఉద్యోగాలు ఉంటాయో.. పోతాయో అన్న టెన్షన్ లో ఉన్న వారికి మరో షాక్ ఇచ్చింది.
AP government Volunteers: ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్ల పరిస్థితి మరీ దయానీయంగా మారింది. ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా వారి సిట్యూవేషన్ ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో రాజీనామాలు చేసిన వాళ్లు తమను తిరిగి, రెగ్యులర్ చేయాలంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం చంద్రాబాబును కలసి తమ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గత వైసీపీ నాయకులు బెదిరింపులకు గురిచేసి తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ వాలంటీర్లు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలపై ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు ఆయా పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశంలో తమగురించి ఏదైన నిర్ణయం తీసుకుంటారో అని వాలంటీర్లు గంపేడాశతో ఎదురు చూశారు.
ఈ నేపథ్యంలో మాత్రం వాలంటీర్లకు చంద్రబాబు సర్కారు ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పుకొవచ్చు. గత ప్రభుత్వం హయాంలో.. అదనంగా ఇస్తున్న పేపర్ అలవెన్స్ ప్రతి రూ. రెండు వందలను నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ సర్య్కూలేషన్ ను పెంచుకునేందుకు.. వాలంటీర్లతో సాక్షి పత్రిక కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు గురించి కూడా ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. వాలంటీర్లకు ఇస్తున్న పేపర్ అలవెన్స్ జీవోను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు కొద్ది రోజుల కిందట ఆదేశించిన విషయంను గుర్తు చేసింది. ఏపీలో వాలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం నెలకు రూ.200 ఇస్తూ.. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
సాక్షి సర్క్యూలేషన్ పెంచుకునేందుకే జీవో..
సాక్షి పత్రిక అక్రమ మార్గంలో.. తన సర్క్యూలేషన్ పెంచుకుంటున్నారని ఉషోదయా పబ్లికేషన్స్ ఆరోపించారు. 200 రూపాయలతో సాక్షి పత్రిక మాత్రమే కొంటున్నారని ఆరోపించింది. ఈ కేసులో తొలుత.. ప్రభుత్వానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీంతో ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అనంతరం కేసును ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
Read more: Snake bite: రోజుకు ఒకర్ని కాటేసి చంపేస్తున్న పాము..?.. రెండు దశాబ్దాల తర్వాత మరల హడల్..
దీంతో సోమవారం వాలంటీర్లపై కేసును ఢిల్లీ హైకోర్టు విచారించింది. విచారణ తర్వాత అలాంటి జీవోలు ఎలా ఇస్తారని ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా.. గత ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్శిటీలు , ఒక్కొక్క గ్రామ సచివాలయంలో రెండు కాపీలు చొప్పున సాక్షి పత్రికను పంపిణీ చేసేవారు. వాలంటీర్లు వెంటపడి మరీ కొనిపించారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వాలంటీర్లకు ఏపీ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. జులై 1 న లబ్దిదారులకు.. ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారానే పింఛన్ ల పంపిణికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా.. తీసేస్తారా..అనే దానిపై మాత్రం ఇంకా సంధిగ్ధత మాత్రం కొనసాగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి