Usikaya pachadi: వావ్.. యమ్మీ.. ఉసిరికాయ పచ్చడిని ఎంత ఈజీగా చేయోచ్చో తెలుసా..?

Usirikaya Avakaya: చలికాలంలో ఉసిరి కాయలు మార్కెట్ లో ఎక్కువగా వస్తుంటాయి. అయితే.. ఉసిరి కాయ ఆవకాయ ఎంతో టెస్టీగా ఉంటుంది. దీని వల్ల శరీరంకు అనేక ఉపయోగకర కారకాలు కూడా లభిస్తాయి.

1 /6

సాధారణంగా చాలా మంది ఏడాది పొడగున నిల్వ ఉండే విధంగా ఉసిరి కాయ పచ్చడిని చేసుకుంటారు. కానీ కొన్ని ప్రత్యేకమైన సీజన్ లలో మాత్రమే ఉసిరి కాయలు లభిస్తాయి. 

2 /6

ఉసిరి కాయల వల్ల మన శరీరంకు విటమిన్ లు, మినరల్స్ కూడా దొరుకుతుంటాయి. అందుకే ఉసిరికాయల్ని ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతుంటారు.  

3 /6

ఉసిరి కాయల ఆవకాయ పచ్చడి ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్ నుంచి ఉసిరి కాయల్ని తెచ్చుకొవాలి. ముందుగా వాటిని వేడి నీళ్లలో ఉప్పు వేసి మరీ శుభ్రంగా కడిగేయాలి.

4 /6

ఆ తర్వాత ఉసిరి కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొవాలి. మరోక కడాయ్ లో నూనె వేసుకొవాలి. దానిలో ఆవాలు,జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లూల్లీ పేస్ట్ లను వేయాలి  

5 /6

ఇలా వేసిన తర్వాత..ఆ నూనెను తీసుకుని ఆవకాయ ముక్కలు ఉన్న గిన్నెలో వేయాలి. అంతే కాకుండా.. ఉసిరి ముక్కలపై ఉప్పు, కారం, ధన్యాల పొడి వంటివి ముక్కలకు సరిపడేంత వేయాలి..  

6 /6

ఆ తర్వాత ఒక గంట పాటు ఈ ఉసిరి కాయ పచ్చడిని అలానే ఉంచేసి..ఆ తర్వాత తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే.. ఒక రోజుతర్వాత ఉసిరి కాయలు నూనె, మిగత పదార్థాలు మంచిగా పీల్చుకుంటాయి. అప్పుడు పచ్చడి ఇంకా యమ్మీ యమ్మీగా టెస్టీగా ఉంటుంది.